సంప్రదాయ రంగులు... మోడ్రన్ హంగులు..! | Traditional Colors ... Modern Added ..! | Sakshi
Sakshi News home page

సంప్రదాయ రంగులు... మోడ్రన్ హంగులు..!

Published Sun, Oct 18 2015 11:38 PM | Last Updated on Sun, Sep 2 2018 4:03 PM

సంప్రదాయ రంగులు... మోడ్రన్ హంగులు..! - Sakshi

సంప్రదాయ రంగులు... మోడ్రన్ హంగులు..!

పండగ షాపింగ్!
పండగ రోజుల్లో మీకోసం మీరు సరైన దుస్తులను ఎంపిక చేసుకోవడమే కాదు..మీ అమ్మ, తోబుట్టువులు, స్నేహితులకు అద్భుతమైన కానుకలు ఇచ్చి వారిని ఆశ్చర్యపరుద్దాం అనుకుంటారు. మగవారు కూడా తమ భార్య, కూతురు, చెల్లెళ్ల కోసం షాపింగ్  చేసేస్తుంటారు. అయితే, పండగ రోజుల్లో షాపింగ్ అనగానే చాలా మంది సంప్రదాయ డిజైన్స్ వైపే మొగ్గు చూపుతారు. ఇందుకు చీరలు, అనార్కలీలు, సంప్రదాయ గౌన్లను ఎంపిక చేస్తుంటారు. ‘వీటిలోనే కొంత మోడ్రన్ టచ్ ఉన్నవి ఎంచుకుంటే మీ ఎంపిక అత్యుత్తమమని, అలాగే మీరు ధరించిన ఔట్‌ఫిట్స్ బెస్ట్ అని బోలెడు ప్రశంసలు కొట్టేయవచ్చు’ అంటున్నారు ఈ తరం డిజైనర్లు.
 
మీ కోసం, మీ ఆత్మీయుల కోసం షాపింగ్ చేసే ముందు ఇవి గుర్తు పెట్టుకోండి...

హ్యాపీ... హాఫ్‌శారీస్
పండగ కళను రెట్టింపు చేసేవి డిజైనర్ హాఫ్ శారీసే. మీ చుట్టూ వాతావరణాన్ని కలర్‌ఫుల్‌గా మార్చేయాలన్నా హాఫ్‌శారీస్ బెస్ట్ ఆప్షన్. అమ్మాయిలే కాదు అమ్మలు కూడా ఈ రోజుల్లో హాఫ్‌శారీస్‌ను ధరిస్తున్నారు కాబట్టి నిరభ్యంతరంగా వీటిని ఎంచుకోవచ్చు. బ్లౌజ్‌లకు మిర్రర్ వర్క్ ఉన్నవి ఎంచుకుంటే మరింత కాంతిమంతంగా కనిపిస్తారు.
 
అత్యుత్తమమైన చీర
చాలా స్టోర్స్‌లలో నేటి కాలానికి తగినట్టు భిన్నమైన అంచులు, ప్రింట్లతో ఆకట్టుకుంటున్నాయి. వీటిలో సంప్రదాయానికి ప్రాముఖ్యమిస్తూనే, ప్రింట్లు, అంచులలో కొంత ఆధునికత జోడించినవి ఎంచుకోండి. మీరు ఎంపిక చేసినవి మీకు మాత్రమే కాదు ఆ కానుక అందుకునేవారి కంటికీ నప్పాలి. సాధారణంగా పండగకు ఎరుపు, పచ్చ, పసుపు, నీలం... రంగులు అట్రాక్ట్ చేస్తాయి. వీటిలోనే అంచులు, ప్రింట్లు, మోటిఫ్స్.. ఈ కాలానికి తగినట్టుగా ఉండేవి ఎంపిక చేయండి. అలాగే, ఆ చీర కట్టుకునేవారు ఎంత ఆకర్షణీయంగా కనపడతారో ఊహించుకుని తీసుకుంటే మీ సెలక్షన్‌కి నూటికి 90 మార్కులు వచ్చేసినట్టే.
 
అనార్కలీ సూట్
ఒకటి రెండూ కాదు అనార్కలీలో వందల డిజైన్లు వచ్చాయి. చిన్న చిన్న పట్టణాలలోని పేరున్న అన్ని బట్టల షాపులలోనూ ఎన్నో మోడల్స్ కనువిందు చేస్తున్నాయి. వీటిలో రంగులు, ప్రింట్లు కాంట్రాస్ట్ ఉండేలా చూసుకుంటూనే, ఎంబ్రాయిడరీవి సెలక్ట్ చేయండి. ముఖ్యంగా నెక్‌లైన్స్, స్లీవ్స్ దగ్గర వర్క్, కట్స్ బాగున్నవి ఎంచుకోండి.
 
ఆధునిక కుర్తీలు
ఎన్నో కట్స్, స్టైల్స్‌తో కుర్తీలు షాప్‌లలో బారులు తీరి ఉన్నాయి. టీనేజ్ అమ్మాయిలకు, మధ్య వయసు గలవారికి స్పోర్ట్స్ తరహా అంటే చాలా హుందాగా, సౌకర్యంగా అనిపించే కుర్తీలను ఎంపికచేస్తే వారి ఆత్మవిశ్వాసాన్ని ఇంకాస్త పెంచినట్టుగా ఉంటుంది. ఈ తరహావి ఎంపిక చేయడం రోజుల్లో చాలా సులువు. కొంత సంప్రదాయం మిక్స్ అవ్వాలంటే మాత్రం ఎంబ్రాయిడరీ, జరీ పనితనం ఉన్న కుర్తీలను ఎంచుకోవాలి.
- ఎన్.ఆర్.
 
ఈ పండగకి మీ వార్డ్‌రోబ్...
సంప్రదాయాన్ని మిస్ అవకుండానే ఆధునికంగా కనిపించడానికి నేడు ఎన్నో దారులు ఉన్నాయి. ఆధునికం, సంప్రదాయం కలగలిసేలా మీ వార్డ్‌రోబ్‌ను మార్చేయండి. భారతీయ ఫ్యాబ్రిక్, డిజైన్స్ ఇప్పుడు ప్రపంచ ఫ్యాషన్‌గా మారిపోయాయి. గ్లోబల్ ట్రెండ్స్‌ను పరిశీలిస్తే మీకీ విషయం సులువుగా అర్థమైపోతుంది. స్టోర్స్ షో కేస్‌లు చూస్తే సంప్రదాయ గౌన్లకు మోడ్రన్ టచ్ ఇచ్చినవే అధికంగా కనిపిస్తాయి. జరీ, ఖరీదైన ఫ్యాబ్రిక్, రంగులను బట్టి ఎంపిక చేసుకుంటే సరి. అయితే, వీటిలోనే మోడ్రన్ ప్రింట్లు, మోటిఫ్స్ ఉన్నవి ఎంచుకుంటే పండగకు నప్పే విధంగానూ ఉంటాయి. ఆ తర్వాత రోజుల్లో సందర్భానుసారం ధరించడానికి అనువుగానూ ఉంటాయి.
 
మేకప్‌లో రంగులు...
మీ ఆత్మీయులకు మేకప్ కిట్ ప్రెజెంట్ చేయాలనుకుంటే.. పింక్, ఆకుపచ్చ, నిమ్మ, నీలం, ఎరుపు, పీచ్ కలర్స్ లేతవి ఎంచుకోవాలి. లేత వంగపండు, పింక్ షేడ్స్‌తో ఎన్నో ప్రయోగాలు చేయవచ్చు.
 
అలంకరణ

* రోజులా కాకుండా హెయిర్‌స్టైల్‌ని మార్చేయండి. తల అంతా దువ్వి, కొప్పులా కట్టి, ఫఫ్ పెట్టేయండి. లేదంటే ఫిష్‌స్టైల్ ట్రై చేయండి.
* ప్లెయిన్ శారీ కట్టుకున్నప్పటికీ ఎంబ్రాయిడరీ, అద్దం పనితనం ఉన్న బ్లౌజ్‌లను ఎంచుకోండి. అందంగా వెలిగిపోతారు.
* పెద్ద అంచు చీరలు కట్టినప్పుడు స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లు ధరిస్తే అల్ట్రామోడ్రన్ అనిపిస్తారు.
* దుస్తులు మంచి బ్రైట్ కలర్స్, డిఫరెంట్ షేడ్స్ ఉన్నవి ఎంచుకోండి.  
* వాటర్‌ఫ్రూఫ్ మేకప్ మేలైనది.
* టెంపుల్ డిజైన్స్‌కి ఫస్ట్ ప్లేస్ ఇవ్వండి. చెవులకు పెద్ద పెద్ద బుట్టలు, మెడలో హారాలు, ... మిమ్మల్ని మరింత ఆకర్షణీయంగా మార్చేస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement