మనింట్లో ఓ తొంభై ఏళ్ల నానమ్మ కానీ అమ్మమ్మ కానీ ఉందా? ఉంటే ఆమెనడగండి ఓ మాట. వాళ్ల యువతరాన్ని ఆకట్టుకున్న చీరలేమిటి అని. ఎంతో ఉత్సాహంగా ఇప్పుడు మనం వినని ఎన్నో పేర్లు చెబుతారు. ఓ పది రకాల పేర్లు చెప్పి ‘ఇప్పుడా నేత ఎక్కడ వస్తోంది. వచ్చినా ఈ తరంలో ఆ చీరలెవరు కట్టుకుంటారు. నేయడమే మానేసినట్లున్నారు’ అని నిరుత్సాహంగా ముగిస్తారు. సరిగ్గా అలాంటి చీరలకు పూర్వ వైభవం తెస్తున్నారు కర్నాటకకు చెందిన హేమలత. హ్యాండ్‌లూమ్ లవర్స్ వార్డ్‌రోబ్‌లు రెండు వందల ఏళ్ల నాటి చేనేతలతో అలరారుతున్నాయి.
ఎటు కట్టినా ఓకే!
హేమలత... యూఎస్‌లోని కన్సాస్ యూనివర్సిటీలో ఉన్నతవిద్య పూర్తి చేశారు. ఆమెకు మన చేనేత కళలో దాగిన సమున్నత జ్ఞానం మీద దృష్టి పడింది. ఒకదానికి ఒకటి విభిన్నంగా దేనికది ఒక శాస్త్రబద్ధమైన గ్రంథంలాంటి చేనేతల మీద అధ్యయనం మొదలు పెట్టారామె. నిఫ్ట్ (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ)లో ఇదే అంశం మీద పీహెచ్‌డీ చేస్తున్నారు. గిరిజనులు నివసించే ప్రదేశాల్లో విస్తృతంగా పర్యటించారు.
వారి నేత తీరును పరిశీలించారు. ఈ క్రమంలో హేమలతా జైన్ 85 ఏళ్ల దేవదాసిని కలిశారు. ఆమె దగ్గరున్న పట్టెడ అంచు చీర రెండు వందల ఏళ్ల నాటి చేనేత కళ. ఈ చీరకు రెండు కొంగులుంటాయి. చీరను రెండువైపులా కట్టుకోవచ్చు. రివర్సబుల్ శారీ అన్నమాట. పదవ శతాబ్దంలో గజేంద్రఘర్ జిల్లాలోని గ్రామాల్లోని చేనేతకారులు ఈ చీరలను నేసేవారు. అలాంటి చీరలిప్పుడు మార్కెట్‌లో లేవు. ఈ తరంలో ఎవరి దగ్గరా లేవు. ఆ చీరను చూపించి మరొక చీర తయారు చేయించాలంటే ఆ రకమైన నేత నేసే చేనేతకారులు కూడా లేరన్న మరో వాస్తవం తెలిసి వచ్చిందామెకు. అలాంటి అంతరించిపోతున్న డిజైన్‌లు 45 వరకు ఉన్నాయి.
(చదవండి: ముఖ సౌందర్యంపై పెరుగుతున్న మోజు)
Comments
Please login to add a commentAdd a comment