
పెళ్లి మోజులో ప్రియమణి
వయసొచ్చిన పిల్లలకు పెళ్లి కళ రావడం, కన్నెపిల్లలు పెళ్లి ఊహలు గుసగుసలాడడం కాల ప్రభావమే. అయితే కన్నె ఈడు దాటి పరువం వయసులో ఉన్న నటి ప్రియమణికి ఇప్పుడు పెళ్లి ఆశ తీవ్రమైందట. కంగళాల్ ఖైదు సెయ్ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అయిన ఈ అమ్మడిని బహుళ ప్రచారం చేసిన చిత్రం పరుత్తివీరన్. ఈ చిత్రంతో ఏకంగా జాతీయ అవార్డును అందుకున్న ప్రియమణి ఆ తరువాత గ్లామరస్‌కు మారడంతో ఆ ఆ తరహా కొన్ని పాత్రలకే పరిమితం అయ్యారు.
దీంతో తెలుగు, మలయాళం చిత్ర పరిశ్రమలను ఆశ్రయించారు. ప్రస్తుతం అక్కడ అవకాశాలు అడపాదడపా అన్నట్టుగా ఆమె పరిస్థితి ఉంది. దీంతో ఇటీవల తనకు ప్రేమికుడు అతని పేరు ముస్తఫా. ఊరు ఢిల్లీ. అంటూ తన ప్రేమ పురాణాన్ని ఏకరువు పెట్టారు. త్వరలోనే శుభవార్త వెల్లడిస్తానని అన్న ప్రియమణి ఆశలు ఇప్పుడు పట్టుచీరలపై మళ్లింది. రకరకాల పట్టుచీరలు కొనడమే కాకుండా వాటిని ధరించి ఆ ఫొటోలకు తన ట్విట్టర్‌లో పోస్టు చేసి మోజు తీర్చుకున్నారు. ఆ ఫొటోలు కామెంట్‌లకు గురవుతుంటే ప్రియమణి స్నేహితురాలు నటి ప్రియాంక త్రివేది మాత్రం శుభాకాంక్షలు తెలియచేస్తు దేవతలా అంద ంగా ఉన్నావంటూ ఆకాశానికి ఎత్తేసిందట.