ఇక ఏడడుగులే ఆలస్యం! | musthafa raj and priyamani engaged | Sakshi
Sakshi News home page

ఇక ఏడడుగులే ఆలస్యం!

Published Sun, May 29 2016 12:15 AM | Last Updated on Mon, Sep 4 2017 1:08 AM

ఇక ఏడడుగులే ఆలస్యం!

ఇక ఏడడుగులే ఆలస్యం!

చెన్నైకి చెందిన ముస్తఫా రాజ్ అనే వ్యాపారవేత్తతో కథానాయిక ప్రియమణి ప్రేమలో పడిన విషయం తెలిసిందే. ఈ ప్రేమను వివాహ బంధంతో కొనసాగించనున్నారు. బెంగళూరులోని బనశంకరిలో ఉన్న ప్రియమణి స్వగృహంలో కుటుంబ సభ్యుల సమక్షంలో శుక్రవారం ప్రియమణి-ముస్తఫాల వివాహ నిశ్చితార్థ వేడుక జరిగింది. ఇంకా పెళ్లి తేదీ ఖరారు కాలేదు. ఇక ఏడడుగులు వేయడమే ఆలస్యం. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారట. పెళ్లి తర్వాత సినిమాలు చేయాలా? వద్దా? అనే విషయం గురించి ప్రియమణి ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని తెలుస్తోంది. ఏదేమైనా మనసుకి నచ్చిన వ్యక్తితోనే పెళ్లి కుదరడం ఈ బ్యూటీకి ఆనందాన్నిచ్చి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement