
పెళ్లి చేసుకోబోతున్న మరో హీరోయిన్
అందాలతార అసిన్ గత నెలలోనే పెళ్లి చేసుకుని స్థిరపడిపోగా ఇప్పుడు మరో హీరోయిన్ కూడా పెళ్లికి రెడీ అవుతోంది. తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా అలరించిన ప్రియమణి ఈ ఏడాది పెళ్లి చేసుకోనుంది. బోయ్ ఫ్రెండ్ ముస్తఫా రాజ్‌ను తాను పెళ్లాడనున్నట్లు ఓ టీవీ కార్యక్రమంలో స్వయంగా వెల్లడించింది. ముస్తఫారాజ్ను మొదటిసారి ఓ డ్యాన్స్ షోలో కలిశానని, తర్వాత ఆ పరిచయం ప్రేమగా మారిందని ప్రియమణి తెలిపింది. ముస్తఫారాజ్ ముంబైలో ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలో పనిచేస్తున్నట్లు సమాచారం.
అన్నీ అనుకున్నట్టు కుదిరితే ఈ ఏడాది చివరలో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపింది. పెళ్లి తర్వాత సినిమాల్లో నటించేందుకు తనకు అభ్యంతరం లేదని, మంచి స్క్రిప్ట్తో ప్రేక్షకుల ముందుకు వస్తానని చెప్పింది. తెలుగుతో పాటు పలు భాషల్లో విజయవంతమైన సినిమాల్లో నటించిన ప్రియమణి తమిళంలో నటించిన 'పరుత్తివీరన్' సినిమాకుగాను జాతీయ ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు.