Priyamani Break Silences Divorce Rumours: నటి ప్రియమణి.. భర్త ముస్తాఫా రాజ్‌నుంచి కొంత కాలంగా దూరంగా ఉంటుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరిద్దరూ త్వరలోనే విడాకులు తీసుకోనున్నారంటూ పుకార్లు షికార్లు చేశాయి. గతంలో ముస్తఫా తనకు మాజీ భర్త కాదని.. ఇప్పటికీ తాము విడాకులు తీసుకోలేదని ముస్తాఫా మొదటి భార్య అయేషా ఆరోపించిన సంగతి తెలిసిందే. ప్రియమణితో అతడి వివాహం చెల్లదని సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసింది.చదవండి: రీసెంట్‌గానే బ్రేకప్ అయ్యింది.. బాధలో ఉన్నా: విజయ్ దేవరకొండ
ఈ వ్యవహారం అనంతరం ప్రియమణి-ముస్తాఫాల మధ్య గొడవలు వచ్చాయని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. తాజాగా ప్రియమణి తన విడాకులకు సంబంధించిన రూమర్స్‌కు చెక్ పెట్టింది. దీపావళి సందర్భంగా భర్త ముస్తాఫా రాజ్‌తో కలిసి దిగిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. భర్తతో చిరునవ్వులు చిందిస్తూ ఫోటోను పంచుకుంది. దీంతో విడాకుల రూమర్స్‌పై ప్రియమణి పరోక్షంగా బదులిచ్చినట్లయ్యింది.
చదవండి:పునీత్ మరణం తర్వాత తొలిసారి స్పందించిన భార్య అశ్విని
ప్రియుడితో కలిసి దీపావళి చేసుకున్న స్టార్ హీరో కూతురు
Comments
Please login to add a commentAdd a comment