
నిరాడంబరంగా ప్రియమణి వివాహం
సాక్షి, బెంగళూరు: వ్యాపారవేత్త ముస్తఫారాజ్‌ను సినీ నటి ప్రియమణి పెళ్లిచేసుకున్నారు. బెంగళూరులోని జయ నగర రిజిస్ట్రార్ కార్యాలయంలో దండలు మార్చుకుని నిరాడంబరంగా ఒక్కట య్యారు. వీళ్ల నిశ్చితార్థం గత ఏడాది జరిగింది. వివాహానికి వీరిద్దరి కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు.
బంధుమిత్రులు, ఆప్తుల కోసం గురువారం బెంగళూరు శివార్లలోని ఎలెన్ కన్వెన్షన్ హాల్‌లో ఘనంగా రిసెప్షన్ ఏర్పాటుచేశారు.