
దర్శకుడు సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప సినిమా దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే . పుష్ప క్యారెక్టర్‌లోని బన్నీ నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. సినిమాలోని డైలాగులు, పాటలు అన్నీ సూపర్‌హిట్‌గా నిలిచాయి. దీంతో పుష్ప క్యారెక్టర్‌ను అనుకరిస్తూ ప్రపంచం నలుమూలల నుంచి సినీ, క్రికెట్ సెలబ్రిటీలు ప్రత్యేక వీడియోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తున్నారు. సినిమా పేరుతో చిప్స్ ప్యాకెట్స్ కూడా వచ్చాయి. తాజాగా పుష్ప సినిమా మరోసారి వార్తల్లోకి ఎక్కింది.
విభిన్న రకాల దుస్తులను తయారు చేయంలో సూరత్ ప్రసిద్ధి చెందిన విషయం. అక్కడ చరణ్‌జీత్ క్లాత్ మార్కెట్ ప్రస్తుతం ఈ క్లాత్ మార్కెట్ పుష్ప సినిమా పోస్టర్లతో చీరలు రూపొందించింది. పుష్ప సినిమా పాపులర్ అవ్వడంతో ఈ సినిమాతో ప్రత్యేకంగా చీరలు రూపొందించాలని ఈ కంపెనీ యజమాని చరణ్‌పాల్ సింగ్‌కు ఆలోచన వచ్చింది. దీంతో ఆలోచనను ఆచరణలో పెట్టి కొన్ని చీరలను తయారు చేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్టుచేశాడు.
చదవండి: ‘కచ్చా బాదం’ పాటకు అర్హ డ్యాన్స్, వీడియో షేర్ చేసి మురిసిపోయిన బన్నీ
ఇంకేముంది ఈ ఫోటోలు వైరల్ అవ్వడంతో దేశ వ్యాప్తంగా వస్త్ర వ్యాపారుల నుంచి భారీ డిమాండ్లు రావడం ప్రారంభమైంది. ఈ విషయంపై చరణపాల్ మాట్లాడుతూ.. రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల నుంచి తన 'పుష్ప' చీరల కోసం ఆర్డర్లు వస్తున్నాయని తెలిపారు. పుష్ప వచ్చి రెండు నెలలు దగ్గర పడుతున్న ఈ సినిమాకున్న క్రేజ్ తగ్గడం లేదని వీటన్నింటిని చూస్తే అర్థం చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment