Two women get into fist fight in Bangalore for offer sarees - Sakshi
Sakshi News home page

Viral Video: చీరల కోసం జుట్టు పట్టుకుని కొట్టుకున్న మహిళలు

Published Mon, Apr 24 2023 12:41 PM | Last Updated on Mon, Apr 24 2023 4:41 PM

Women fighting in Bangalore for offer sarees - Sakshi

తగ్గింపు ధరలకు చీరలు కొనే సమయంలో ఇద్దరు మహిళలు జుట్లు పట్టుకుని కొట్టుకోవడం జరిగింది.

కర్ణాటక: తగ్గింపు ధరలకు చీరలు కొనే సమయంలో ఇద్దరు మహిళలు జుట్లు పట్టుకుని కొట్టుకోవడం జరిగింది. ఈ ఘటన బెంగళూరు మల్లేశ్వరం 8వ మెయిన్‌ రోడ్డులోని ఒక షాపులో జరిగింది. మైసూరు పట్టు చీరలను 35 శాతం తగ్గింపు ధరలతో అమ్ముతున్నట్లు బోర్డు పెట్టారు.

ఆదివారం సెలవు కావటంతో పెద్దసంఖ్యలో మహిళలు క్యూ కట్టారు. ఒకే చీరను ఇద్దరు మహిళలు ఎంచుకున్నారు, చీరను వదులుకోవడానికి ఎవరూ ఒప్పుకోలేదు. దీంతో గొడవ మొదలై జడలు పట్టుకొని కొట్టున్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారింది. ఇతర మహిళలు ఇద్దరినీ విడిపించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement