నీతా అంబానీ నాటి సంప్రదాయ చీరల మేళవింపుతో సరికొత్త ఫ్యాషన్ ట్రెండ్‌ని తీసుకొచ్చింది. చేతి వృత్తుల వారిని పోత్సహించేలా కనుమరుగవుతున్న నాటి గొప్ప కళా నైపుణ్యాన్ని అందరికీ సుపరిచయ చేస్తున్నారు నీతా. ఇటీవల చిన్న కుమారుడు అనంత్ రాధికల వివాహంలో సైతం వారి ధరించే ప్రతి డిజైనర్ వేర్ చేతితో రూపొందించిన ఎంబ్రాయిడరీ డిజైన్ హైలెట్‌గా నిలిచింది. రాజస్థాన్, కాశీ పట్టణాల్లో ఉన్న పురాతన హస్తకళలను స్ఫురణకు తెచ్చేలా చేశారు.
అయితే మరోసారి నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్(ఎన్‌ఎంఏసీసీ)లో జరిగిన ఈవెంట్‌లో కేరళ సంప్రదాయాన్ని గుర్తుకు తెచ్చేలా కసావు చీరలో తళుక్కుమన్నారు. ఈ చీరను కేరళలోని ప్రతిభావంతులైన కళాకారులు ఏకంగా 20 రోజుల పాటు రూపొందించారు. ఇందులో టిష్యూ పల్లు, మెరూన్ మీనా కరి బుట్టా, అద్భతమైన తొమ్మిది అంగుళాల బంగారు అంచు మృదువైన షీన్‌లు ఉన్నాయి. తెలుపు బంగారు రంగులో ఉన్న ఈ కసావు చీర చరిత్ర చాలా లోతైనది. బహుళ వర్ణ ఛాయచిత్రాలు, బోల్ట్ నమునాలతో చిక్కటి కాటన్ చీరల్లా మెత్తగా ఉంటాయి.
కేరళ కసవు చీరల ప్రత్యేకత..
ఇవి చూసేందుకు సరళమైన క్లాసీగా ఉండే కసవు చీర జరీ, ఒక రకమైన బంగారు దారంతో విలక్షణంగా ఉంటుంది. బలరామపురుం, చెందమంగళం, కుతంపుల్లి వంటి నిర్థిష్ట భౌగోళిక సముహాల నుంచి ఉద్భవించిన ఈ చీరలు కేరళ గొప్ప చేనేత వారసత్వంలో భాగంగా ఉన్నాయి. ప్రాథమిక డిజైన్‌ల నుంచి దాదాపు మూడు నుంచి 5 రోజుల వరకు పట్టే విస్తృతమైన మోటిఫ్‌లు చేతితో నేయబడి ఉంటాయి. బంగారు దారంతో చుట్టూ బోర్డర్ డిజైన్ చేసి ఉంటుంది.
సరసమైన కాటన్ రకాల నుంచి వివిధ రకాల చీరలను ఉత్పత్తి చేస్తారు. వీటి ధర రూ. 1.5 లక్షల నుంచి మొదలై అత్యంత ఖరీదైన ధర పలికే చీరలు కూడా ఉంటాయి. చూసేందుకు సాదాసీదా తెల్లని వస్త్రంలా ఉన్నా బార్డర్ మందం, రంగు అనేవి సందర్భానుసారం డిజైన్ చేసిన చీరలు ఉంటాయి. ఉత్సవానికి సంబంధించిన చీరలు మందమైన బంగారు అంచుతో ఎంట్రాక్టివ్‌గా ఉంటాయి.
(చదవండి: అనంత్ అంబానీ బూండీ జాకెట్..రియల్ గోల్డ్‌తో ఏకంగా 110 గంటలు..!)
Comments
Please login to add a commentAdd a comment