కవ్వింత: ఆర్ట్ గ్యాలరీ! | Art gallery of the week | Sakshi
Sakshi News home page

కవ్వింత: ఆర్ట్ గ్యాలరీ!

Published Sun, Aug 24 2014 12:59 AM | Last Updated on Sat, Sep 2 2017 12:20 PM

కవ్వింత: ఆర్ట్ గ్యాలరీ!

కవ్వింత: ఆర్ట్ గ్యాలరీ!

ఆకులతో స్త్రీ దేహాన్ని కప్పిన ఓ చిత్రాన్ని రామనాథం తదేకంగా చూస్తున్నాడు. అతనితో పాటు వచ్చిన ఫ్రెండు మొత్తం అన్ని చిత్రాలు చూసి రామనాథంను గమనించాడు. ‘‘ఇక వెళ్దాం పద, ఇది ఆకురాలే కాలం కాదు’’ అనడంతో ఉలిక్కిపడి సర్దుకున్నాడు రామనాథం.
 
 చీరలు
 భార్య: కొత్త చీరలు కొనుక్కుంటానండీ.
 భర్త: ఇప్పటికే అల్మారా పట్టట్లేదు కదే!
 భార్య: కట్టిన చీరలే కడుతున్నానని కాలనీ లేడీస్ అనుకుంటున్నారండీ.
 భర్త: అంతమాత్రానికి కొత్త చీరలు కొనడం దేనికి, కాలనీ మారుద్దాం, మనది అద్దిల్లే కదా!
 
 సుపుత్రుడు
 కొడుకు: నాన్నా మీరు లక్కీ.
 తండ్రి: ఎందుకురా?
 కొడుకు: మీరు కొత్త పుస్తకాలు కొనక్కర్లేదు ఈ ఏడాది, నేను ఫెయిలయ్యాను.
 తండ్రి: ఈ తెలివితేటలు పరీక్షల్లో చూపించొచ్చు కదరా!
 
 మోసం
 కిషోర్: ఏరా మీ అమ్మాయికి సంబంధం ఓకే అయిందన్నావుగా ఏమైంది?
 వధువు తండ్రి: ఆ మ్యారేజ్ బ్రోకరు మోసం చేశాడురా?
 కిషోర్: ఏం చేశాడేంటి?
 వ.తండ్రి: సైటు ఉందంటే... మంచి సంబంధం అనుకున్నాం సైటు ఉన్నది ఊళ్లో కాదు, వాడి కంట్లో!
 
 టీవీ లేదా!
 రంగనాథ్: మీ ఇంట్లో టీవీ లేదా ఇంతవరకు?
 గంగాధర్: పిల్లలు చదువులు పాడైతాయని కొనలేదురా
 రంగనాథ్: సరేలే, మీ పిల్లలేరీ?
 గంగాధర్: టీవీ చూడటానికి పక్కింటికెళ్లారు!!!!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement