women body
-
మిమ్మల్ని మీరే పట్టించుకోవాలీ..!
కుటుంబ సభ్యులందరికీ కావలసిన వాటిని అమర్చడంలో పడి మహిళలు తమ ఆరోగ్యం పట్ల తగిన శ్రద్ధ వహించరు. దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా ప్రయోజనం ఉండదని అందరికీ తెలిసిందే. అందువల్ల ముందే మేలుకొనడం అవసరం. నిన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వేడుకలు జరుపుకునే ఉంటారు. అయితే అంతకన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే మహిళలు తమ ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ పెట్టి సమయం కేటాయించడం. తమ వయసుకు తగ్గ పోషకాహారం తీసుకోవడం. అనారోగ్య సమస్యలను దాచిపెట్టకుండా తగిన ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం అవసరం. మీరు ఆరోగ్యంగా ఉంటేనే...మీ కుటుంబం ఆరోగ్యంగా ఆనందంగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి.. ఐరన్ ఉండే ఆహారం... మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన దానిలో ఐరన్ మొదటి స్థానంలో ఉంది. గర్భధారణ సమయంలో స్త్రీలకు ఐరన్ చాలా అవసరం. శరీరంలో ఐరన్ పరిమాణం తగ్గిపోవడం వల్ల రక్తహీనత ఏర్పడుతుంది. దీనివల్ల నీరసం, అలసట, ఊపిరి అందకపోవడం వంటి సమస్యలు వస్తాయి. అందువల్ల మీ ఆహారంలో మాంసకృత్తులు, చికెన్, సీఫుడ్, బీన్స్, కాయధాన్యాలు, బచ్చలి కూర, బ్రోకలీ, బీట్రూట్, దానిమ్మ, ఖర్జూరం, తృణధాన్యాలు వంటి ఐరన్ అధికంగా ఉండే ఆహారాలను చేర్చుకోవడం అలవాటు చేసుకోవాలి. విటమిన్ ఎ తప్పనిసరి... మహిళలకు అవసరమైన విటమిన్ల జాబితాలో విటమిన్ ఎ ద్వితీయ స్థానంలో ఉంది. ఇది మహిళల పునరుత్పత్తి ఆరోగ్యానికి ముఖ్యమైన విటమిన్. ఆహారంలో విటమిన్ ఎ అధికంగా ఉండే ఆకుకూరలు, అరటి పండ్లు వంటివి తీసుకోవాలి. విటమిన్ బి 12.. విటమిన్ బి 12 అనేది జీవక్రియ కార్యకలాపాలను పెంచుతుంది. రక్తహీనతను నివారిస్తుంది, మహిళల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అందువల్ల బీ 12 సమృద్ధిగా ఉండే మాంసం, చేపలు, గుడ్లు తీసుకోవాలి. శాకాహారులు ΄÷ట్టు తియ్యని వేరసెనగపప్పు, సెనగలు, దంపుడు బియ్యం, వెన్న తియ్యని పాలు (జంతువుల నుంచి వచ్చిన పాలు) వంటివి తీసుకోవాలి. కాల్షియం... మహిళలు వయస్సు పెరిగేకొద్దీ, ఎముక సంబంధిత ఆరోగ్య సమస్యలను తరచు ఎదుర్కొంటారు. అందువల్ల, ఎముకల ఆరోగ్యానికి మహిళలు కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ముఖ్యం. ఇందుకోసం పాలు, గుడ్డు, నువ్వులు వంటివి తీసుకోవాలి. విటమిన్ డి... ఈ జాబితాలో విటమిన్ డి తర్వాతి స్థానంలో ఉంది. విటమిన్ డి మన శరీరం కాల్షియాన్ని గ్రహించడంలో సహాయపడుతుంది. ఇది ఎముకలు, దంతాల పెరుగుదలకు సహాయపడుతుంది. మెగ్నీషియం... మెగ్నీషియం కూడా స్త్రీలకు కావలసిన అతి ముఖ్యమైన పోషకం. కండరాల బలం ఎముకల ఆరోగ్యానికి మెగ్నీషియం అవసరం. మహిళలు మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ పరీక్షలు అవసరం.. భారతదేశంలో మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు.. ఎన్నో గణాంకాలు స్త్రీలల్లో ఐరన్ లోపం ఉంది అని చెబుతున్నాయి. కనీసం 10 శాతం కూడా హిమోగ్లోబిన్ ఉండటం లేదు. ఈ పరిస్థితిని ఇలానే నిర్లక్ష్యం చేయడం వల్ల తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.. ముఖ్యంగా ఇది బ్లడ్ క్యాన్సర్‌కు కూడా దారితీస్తుంది. అందువల్ల అత్యవసరమైన సీబీపీ అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్, థైరాయిడ్, విటమిన్ పరీక్షలు, కాల్షియం, కొలెస్ట్రాల్, ఐరన్ వంటి పరీక్షలను చేయించుకోవడం అవసరం. ఇవి చదవండి: సమాజాన్ని అద్దంలో చూపించాను -
అమానవీయం: సైకిల్‌పై భార్య మృతదేహం తరలింపు
లక్నో: కరోనా విజృంభణ వేళ దేశంలో అమానవీయ సంఘటనలు జరుగుతున్నాయి. కరోనాకు భయపడి ప్రజలు అందరినీ అనుమానిస్తున్నారు. కరోనా భయంతో చాలా అప్రమత్తంగా ఉన్నారు. ఈ క్రమంలోనే మరింత దిగజారి ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో మరణించిన తన భార్యను సైకిల్‌పై శ్మశానానికి తరలిస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామంలోకి అతడిని రాకుండా నిలువరించారు. ఉత్తరప్రదేశ్‌లోని జాన్పూర్ జిల్లా అంబర్‌పూర్‌కు చెందిన తిలక్ధారి సింగ్ భార్య రాజ్‌కుమారి (50) అనారోగ్యంతో ఉమానాథ్ జిల్లా ఆస్పత్రిలో చేరింది. చికిత్స పొందుతూ సోమవారం ఆమె మృతిచెందింది. గ్రామం వరకు అంబులెన్స్‌లో మృతదేహం చేరింది. అయితే అక్కడి నుంచి అంత్యక్రియలకు ఎవరూ ముందుకు రాలేదు. నా అనేవారు లేకపోవడంతో అతడు తన భార్యను అంత్యక్రియల కోసం శ్మశానానికి సైకిల్‌పై తరలిస్తున్నాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు అతడిని అడ్డుకున్నారు. ఆమె కరోనాతో మృతి చెందిందనే భయాందోళనతో గ్రామస్తులు ముందుకు కదలనీవలేదు. చివరకు పోలీసుల సహాయంతో అతడు తన భార్య అంత్యక్రియలు నిర్వహించాడు. చదవండి: కరోనాతో ఒకేరోజు ముగ్గురు ప్రముఖులు కన్నుమూత చదవండి: ఆక్సిజన్ సిలిండర్ కోసం 24 గంటల్లో 1,500 కి.మీ జర్నీ जौनपुर अस्पताल में पत्नी की मौत के बाद एम्बुलेस शव अम्बरपुर गांव तक छोड़ गई लेकिन गाव वालों ने अंतिम संस्कार नही करने दिया तो बुजुर्ग साइकिल पर शव रखकर नदी किनारे अंतिम संस्कार के लिए चल पड़े हालांकि बाद में @jaunpurpolice की मदद से गांव में ही अंतिम संस्कार हुआ ।@AjayPandeyTV9 pic.twitter.com/Fza3G0Q03M — Manish kumar (@manishtv9) April 28, 2021 -
కవ్వింత: ఆర్ట్ గ్యాలరీ!
ఆకులతో స్త్రీ దేహాన్ని కప్పిన ఓ చిత్రాన్ని రామనాథం తదేకంగా చూస్తున్నాడు. అతనితో పాటు వచ్చిన ఫ్రెండు మొత్తం అన్ని చిత్రాలు చూసి రామనాథంను గమనించాడు. ‘‘ఇక వెళ్దాం పద, ఇది ఆకురాలే కాలం కాదు’’ అనడంతో ఉలిక్కిపడి సర్దుకున్నాడు రామనాథం. చీరలు భార్య: కొత్త చీరలు కొనుక్కుంటానండీ. భర్త: ఇప్పటికే అల్మారా పట్టట్లేదు కదే! భార్య: కట్టిన చీరలే కడుతున్నానని కాలనీ లేడీస్ అనుకుంటున్నారండీ. భర్త: అంతమాత్రానికి కొత్త చీరలు కొనడం దేనికి, కాలనీ మారుద్దాం, మనది అద్దిల్లే కదా! సుపుత్రుడు కొడుకు: నాన్నా మీరు లక్కీ. తండ్రి: ఎందుకురా? కొడుకు: మీరు కొత్త పుస్తకాలు కొనక్కర్లేదు ఈ ఏడాది, నేను ఫెయిలయ్యాను. తండ్రి: ఈ తెలివితేటలు పరీక్షల్లో చూపించొచ్చు కదరా! మోసం కిషోర్: ఏరా మీ అమ్మాయికి సంబంధం ఓకే అయిందన్నావుగా ఏమైంది? వధువు తండ్రి: ఆ మ్యారేజ్ బ్రోకరు మోసం చేశాడురా? కిషోర్: ఏం చేశాడేంటి? వ.తండ్రి: సైటు ఉందంటే... మంచి సంబంధం అనుకున్నాం సైటు ఉన్నది ఊళ్లో కాదు, వాడి కంట్లో! టీవీ లేదా! రంగనాథ్: మీ ఇంట్లో టీవీ లేదా ఇంతవరకు? గంగాధర్: పిల్లలు చదువులు పాడైతాయని కొనలేదురా రంగనాథ్: సరేలే, మీ పిల్లలేరీ? గంగాధర్: టీవీ చూడటానికి పక్కింటికెళ్లారు!!!!