గ్రామం యూనిట్‌గా బతుకమ్మ కానుక కింద పేద మహిళలకు చీరలను పంపిణీ చేయనున్నట్టు ప్రభుత్వ సీఎస్ ఎస్పీ సింగ్ తెలిపారు.
మున్సిపాలిటీల పరిధిలో మున్సిపల్ కమిషనర్లు , ఇతర ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు ఈ పంపిణీకి బాధ్యత వహిస్తారన్నారు. సెప్టెంబర్ 15కల్లా జిల్లా పాయింట్‌లకు చీరలను చేరవేస్తారన్నారు. వాటిని గ్రామాల్లోని గోడౌన్లకు 17లోగా పంపాలన్నారు. గ్రామ స్థాయిలో జిల్లా కలెక్టర్లు నియమించిన ప్రభుత్వ ఉద్యోగులు పంపిణీ చేస్తామన్నారు. పంపిణీ పూర్తి పారదర్శకంగా ఉండాలని సూచించారు. కలెక్టర్లు బతుకమ్మ చీరల పంపిణీ ప్రణాళికను వారం రోజుల లోపల రూపొందించాలని ఆదేశించారు. సిబ్బందికి పంపిణీ విషయంలో శిక్షణ కూడా ఇవ్వాలని కోరారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో జీహెచ్‌ఎంసీ చీరలు పంపిణీ చేస్తుందన్నారు.