Poor women
-
తిరుపతి జిల్లా చంద్రగిరిలో టీడీపీ నేతల దౌర్జన్యం
-
కరోనా రుణంలోనూ వాటా!
సాక్షి, చీరాల: మెప్మాలో అవినీతి రాజ్యమేలుతోంది. పేద మహిళల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని కొందరు అందినకాడికి దండుకుంటున్నారు. రుణం పేరుతో కాసుల వసూలుకు దిగి పొదుపు మహిళలను దగా చేస్తున్నారు. మీకు రుణం ఇస్తే.. మాకేమి ఇస్తారంటూ.. పొదుపు మహిళలను ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. పొదుపు సంఘాల అధ్యక్షుల ద్వారా రిసోర్సు పర్సన్లే ఈ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. జిల్లాలోని చీరాల మున్సిపాలిటీతో పాటు పలు మున్సిపాలిటీల్లో ఇదే తంతు నడుస్తోంది. కరోనా విపత్కర పరిస్థితి ఏర్పడి పేద, బడుగు వర్గాలతో పాటు అన్ని వర్గాల పరిస్థితి చిన్నాభిన్నమైంది. ఇందులో ముఖ్యంగా సగటు జీవులు నానా అవస్థలు పడుతున్నారు. దారిద్య్రరేఖ దిగువ ఉన్న వారికి కరోనా కష్టాలు తెచ్చి పెట్టింది. (కరోనా.. కాలయములైన కజిన్స్) దినసరి కూలీలు, వృత్తి వ్యాపారాలు చేసుకునే వారు ఇందులో ప్రధానంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం పేద, మధ్య తరగతి వారిని ఆదుకునేందుకు, ఆర్థిక ఇబ్బందుల్లో కూడా చేయూత ఇచ్చింది. ప్రతి కుటుంబానికి వెయ్యి రూపాయలతో పాటు రెండు నెలల కాలంలో నాలుగు దఫాలుగా ఉచితంగా రేషన్ అందించింది. దీంతో పాటు పొదుపు సంఘాలకు సున్నా వడ్డీని అందించడంతో పాటు ప్రధానంగా ఇప్పటికే బ్యాంకు రుణాలు తీసుకుని చెల్లిస్తున్న పొదుపు సంఘాల వారికి కరువు రుణం పేరుతో ప్రతి గ్రూపునకు రూ.50 వేలు చొప్పున రుణం ఇవ్వాలని ప్రభుత్వం బ్యాంకులను ఆదేశించింది. కరువు కాలంలో పొదుపు సంఘాలను ఆదుకుంటే ఆయా కుటుంబాలకు ఆర్థిక ఇబ్బందులు ఉండవని ప్రభుత్వం భావించింది. (‘గూగూల్ ప్రణాళికల కోసం ఉద్యోగులు కలిసిరావాలి’) జిల్లాలోని సగానికిపైగా పొదుపు సంఘాలకు రూ.50 వేలు చొప్పున రుణ సౌకర్యం కల్పించింది. జిల్లాలో అద్దంకి, చీమకుర్తి, చీరాల, గిద్దలూరు, కందుకూరు, కనిగిరి, మార్కాపురం, ఒంగోలు మున్సిపాలిటీ పరిధిలో 10,980 పొదుపు సంఘాలు ఉన్నాయి. వీటిలో ఇప్పటి వరకు 300 నుంచి 400 గ్రూపుల వరకు రూ.50 వేలు చొప్పున కరువు రుణాలు అందించారు. మిగిలిన వాటికి కూడా రుణం ఇచ్చే ప్రక్రియ కొనసాగుతోంది. కరోనా నిబంధన నేపథ్యంలో బ్యాంకర్లు ఇళ్ల వద్దకే వచ్చి రుణాలు అందిస్తున్నారు. కరువు రుణాల్లో కూడా మెప్మా సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. చీరాల మున్సిపాలిటీలో రూ.50 వేల రుణం తీసుకున్న గ్రూపుల అధ్యక్షుల వద్దకు వెళ్లి మీకు రుణం ఇచ్చాం.. మాకు గ్రూపులో ఉన్న పది మంది కలిసి రూ.2 వేలు చొప్పున చెల్లించాలని, ఇతర అధికారులకు తాము ఇవ్వాలని కొంతమంది రిసోర్సు పర్సన్లు రుణం ఇచ్చిన రోజే నగదు వసూలు చేశారు. పొదుపు సంఘాల మహిళలకు వారి వాటాకు వచ్చిన రూ.5 వేలలో రూ.200 చొప్పున వసూలు చేయడం ఏమిటని వాపోతున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే భవిష్యత్తులో ఏదైనా రుణం కోసం వస్తే ఇబ్బందులు పెడతారని వెనకడుగు వేస్తున్నారు. ఉదాహరణకు చీరాల మున్సిపాలిటీలో 1500 గ్రూపులు ఉన్నాయి. ఒక్కో గ్రూపు నుంచి రూ.2 వేలు చొప్పున వసూలు చేస్తే రూ.3 లక్షలు వసూలవుతాయి. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో ఇదే తంతు జరగుతుంటే మెప్మాలో పొదుపు మహిళలను ఏ స్థాయిలో మోసం చేస్తున్నారో తెలుసుకోవచ్చు. గతంలోనూ ఇదే తంతు చీరాల మున్సిపాలిటీలో గతంలోనూ ఇదే విధంగా అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు. చీరాలలో రెండు మహిళా సంఘాల పేరుతో రుణం ఇచ్చినట్లు నమోదు చేసి లక్షల రూపాయలు స్వాహా చేశారు. పేద మహిళల పిల్లలకు ఇవ్వాల్సిన ఉపకార వేతనాలు కూడా ఇవ్వలేదు. దీంతో చీరాల తరహాలో ఒంగోలు, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి ప్రాంతాల్లో మెప్మా తీరుపై ఆరోపణలు వచ్చాయి. చీరాలలో జరిగిన వ్యవహారంపై పోలీసు విచారణ కూడా జరిగింది. -
బతుకమ్మ చీరల విలువ రూ.200 కోట్లు
పంపిణీపై కలెక్టర్లతో సీఎస్ సమీక్ష సాక్షి, హైదరాబాద్: గ్రామం యూనిట్‌గా బతుకమ్మ కానుక కింద పేద మహిళలకు చీరలను పంపిణీ చేయనున్నట్టు ప్రభుత్వ సీఎస్ ఎస్పీ సింగ్ తెలిపారు. వీటికోసం రూ.200 కోట్ల వ్యయం కానున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంపై శనివారం సచివాలయం నుంచి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆహార భద్రత కార్డులో నమోదైన 18 ఏళ్లు నిండిన మహిళలందరికీ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. లబ్ధిదారులు ఫొటో గుర్తింపు కార్డులను చూపించాల్సి ఉంటుందన్నారు. ఆగస్టు 1న నవీకరించిన ఆహార భద్రత కార్డుల జాబితా ప్రకారం పంపిణీ ఉంటుందన్నారు. మున్సిపాలిటీల పరిధిలో మున్సిపల్ కమిషనర్లు , ఇతర ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు ఈ పంపిణీకి బాధ్యత వహిస్తారన్నారు. సెప్టెంబర్ 15కల్లా జిల్లా పాయింట్లకు చీరలను చేరవేస్తారన్నారు. వాటిని గ్రామాల్లోని గోడౌన్లకు 17లోగా పంపాలన్నారు. గ్రామ స్థాయిలో జిల్లా కలెక్టర్లు నియమించిన ప్రభుత్వ ఉద్యోగులు పంపిణీ చేస్తామన్నారు. పంపిణీ పూర్తి పారదర్శకంగా ఉండాలని సూచించారు. కలెక్టర్లు బతుకమ్మ చీరల పంపిణీ ప్రణాళికను వారం రోజుల లోపల రూపొందించాలని ఆదేశించారు. సిబ్బందికి పంపిణీ విషయంలో శిక్షణ కూడా ఇవ్వాలని కోరారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో జీహెచ్ఎంసీ చీరలు పంపిణీ చేస్తుందన్నారు. -
మహిళలకు బతుకమ్మ కానుక
- 1,04,57,610 మందికి చేనేత చీరలు - సెప్టెంబర్ 18, 19, 20 తేదీల్లో పంపిణీ - కుల, మతాలకు అతీతంగా పేద మహిళలందరికీ అందజేత - దీనితో చేనేత కార్మికులకు చేయూత - ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన సాక్షి, హైదరాబాద్: బతుకమ్మ పండుగను పురస్కరించుకుని రాష్ట్రంలో ని 18 ఏళ్లు నిండిన పేద మహిళలందరికీ చీరలను కానుకగా ఇవ్వనున్నట్లు ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. రాష్ట్రంలోని 1,04,57,610 మందికి సెప్టెంబర్ 18, 19, 20 తేదీలలో ఈ చీరలు పంపిణీ చేయనున్నట్లు వెల్లడిం చారు. కుల, మతాలకు అతీతంగా పేద మహిళలందరికీ చీరలు పంచనున్నట్లు తెలిపారు. పవర్ లూమ్, చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడం కోసం వారు నేసిన చీరలనే కొనుగోలు చేసి పంపిణీకి సిద్ధం చేస్తున్నామన్నారు. పేద మహిళలందరికీ చీరలందించే విధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయా లని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులకు సీఎం పిలుపునిచ్చారు. చీరల పంపిణీ కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షించా ల్సిందిగా కలెక్టర్లను ఆదేశించారు. బతుకమ్మ కానుకగా చీరలు పంపిణీ చేసే కార్యక్రమంపై ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. ‘‘తెలంగాణ ప్రజలంతా కులమతాలకతీతంగా బతుకమ్మ, దసరా పండుగలను జరుపుకుంటారు. బతుకమ్మ రాష్ట్ర పండుగ. తెలంగాణ ప్రజల జీవితాలతో ముడిపడిన పండు గ. కుటుంబ బంధాలకు ఈ పండుగ ప్రతీక. ప్రతీ ఆడపడుచు తన సొంతిం టికి వెళ్లి ఆనందంగా జరుపుకునే వేడుక. ఈ పండుగను ప్రజలంతా మరింత సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో పేద మహిళలందరికీ చీరలను కానుకగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలకు, క్రిస్మస్ సందర్భంగా క్రై స్తవులకు దుస్తులు పంపిణీ చేశాం. కానీ బతుక మ్మ చీరలను మాత్రం రాష్ట్రంలోని హిం దూ, ముస్లిం, క్రైస్తవులతో పాటు అన్ని కులాలు, అన్ని మతాల పేద మహిళలం దరికీ పంపిణీ చేయాలని నిర్ణయిం చాం’’అని సీఎం ప్రకటించారు. ఈ సందర్భంగా పంపిణీ చేసే చీరల నాణ్యతను పరిశీలించి ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. చీరలను పంపిణీ చేసే విధానంపై అధికారులతో మాట్లాడి షెడ్యూల్ ఖరారు చేశారు. చేనేత కార్మికుల కోసమే ‘‘మరమగ్గాలు, చేనేత మగ్గాలను ఆధారం చేసుకుని బతికే కార్మికుల పరిస్థితి దారుణంగా ఉంది. పనిలేక కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడే దుస్థితి వచ్చింది. ఈ పరిస్థితిని మార్చేం దుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. అందుకే ఈ చీరలను వారినుంచే కొనుగోలు చేస్తున్నది. దీనివల్ల కార్మికు లకు ఉపాధి దొరుకుతుంది. పనికి హామీ లభిస్తున్నది. బతుకుకు భరోసా ఏర్పడుతున్నది. చీరల పంపిణీ వల్ల మహిళల పండుగ సంబురం రెట్టింపు అవడంతో పాటు నేత కార్మికులు ఉపాధి పొంది సంతృప్తి పడుతున్నారు. ఇది మాకు ఎంతో ఆనందంగా ఉంది. మరమగ్గాలను ఆధునీకరించే పని వేగంగా పూర్తి చేస్తున్నాం. నూలు, రసా యనాలను 50 శాతం సబ్సిడీపై అంది స్తున్నం. దీని ద్వారా నేత కార్మికులకు లాభం జరుగుతుంది’’ అని ముఖ్య మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులకు లేఖ రాయాలని మంత్రి కేటీఆర్‌ను సీఎం ఆదేశించారు. ఈ సమీక్షలో పౌరస రఫరాల కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శ న్‌రెడ్డి, ఎండీ సీవీ ఆనంద్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.సింగ్, హ్యాం డ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ డైరెక్టర్ శైలజా రామయ్యర్, తదితరులు పాల్గొన్నారు. చీరల తయారీకి ఆర్డర్ రాష్ట్రంలో కోటీ 4లక్షల పైగా ఉన్న పేద మహిళలకు పంపిణీ చేయడానికి అంతే సంఖ్యలో చీరలు తయా రు చేసేందుకు ఇప్పటికే ఆర్డర్లు ఇచ్చా రు. ఉత్పత్తి కేంద్రాల నుంచి చీరలు సెప్టెంబర్ 2వ వారంలో జిల్లా కేం ద్రాలకు చేరుకుంటాయి. జిల్లా కేంద్రం నుంచి గ్రామాలకు చీరలను పంపుతారు. రేషన్ షాపుల వారీగా సెప్టెంబర్ 18, 19, 20 తేదీల్లో ప్రత్యే కంగా ఏర్పాటు చేసే కేంద్రాల్లో మహి ళలకు చీరలు పంపిణీ చేస్తారు. సదరు మహి ళ పంపిణీ కేంద్రానికి రాలేని పరిస్థితి ఉంటే ఆమె భర్తకానీ, తల్లి గాని, తండ్రిగానీ తీసుకుపోవచ్చు. ఆధార్ కార్డు గానీ, ఓటర్ గుర్తింపు కార్డు కానీ, మరేదైనా ఫోటో గుర్తింపు కానీ చూపించాల్సి ఉంటుంది. -
జిల్లాకు 70వేల ‘దీపం’ కనెక్షన్లు!
సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి : పేద మహిళలకు శుభవార్త. జిల్లాకు ‘దీపం’ పథకం కింద ప్రభుత్వం 70వేల వంటగ్యాస్ కనెక్షన్లను మంజూరు చేసింది. ప్రతి నియోజకవర్గానికి 5వేల కనెక్షన్లను కేటాయించిన సర్కారు.. జనాభా ప్రాతిపదికన ఎంపిక చేయాలని నిర్దేశించింది. ప్రస్తుతం ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున ఏప్రిల్ మొదటివారంలో లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ చేపట్టాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. దారిద్య్రరేఖకు దిగువనున్న మహిళలకే ఈ పథకం వర్తించనుంది. ఇప్పటికే గ్యాస్ కనెక్షన్ ఉన్నవారిని పరిగణనలోకి తీసుకోరు. దీపం కింద గ్యాస్ బండ పొందే లబ్ధిదారులు అమ్మడం కానీ, బదిలీ చేయడం కానీ కుదరదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదిలావుండగా, గతంలో లబ్ధిదారుల ఎంపికలో జాప్యం కావడంతో గ్యాస్ కనెక్షన్లు రద్దయ్యాయి. అయితే, అప్పట్లో ఎంపిక చేసిన 22వేల మంది జాబితాను తాజాగా ఎంపికలో పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఆహారభద్రత సమాచారాన్ని క్రోడీకరించడం ద్వారా లబ్ధిదారులను గుర్తించనున్నామని స్పష్టం చేశారు. -
మాఫీ... టోపీ!
డ్వాక్రా రుణాల మాఫీపై స్పష్టత ఇవ్వని సీఎం రుణాల వసూళ్లకు బ్యాంకర్ల శ్రీకారం! పొదుపు సొమ్ము ‘కంతు’ల కింద జమ తరిగిపోతున్న సామాజిక పెట్టుబడి నిధి..! పేద మహిళలు రెక్కల కష్టంతో పైసా పైసా కూడబెట్టుకుని దాచుకున్న మొత్తాన్ని చంద్రబాబు ప్రభుత్వం దోచుకుంటోంది. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని, ఎవ్వరూ కంతులు కట్టాల్సిన అవసరం లేదని ఎన్నికల్లో బాబు ప్రచారం చేశారు. ఆయన మాటలు నమ్మి మహిళలు ఓట్లేశారు. కంతులు కట్టడం మానుకున్నారు. బాబు సీఎం అయ్యాక డ్వాక్రా రుణాల మాఫీ ఊసే ఎత్తలేదు. దీంతో బ్యాంకర్లు మహిళా సంఘాల పొదుపులోంచి నెలనెలా డబ్బు కట్ చేసేస్తున్నారు. ఇదేమంటే దిక్కున్న చోట చెప్పుకోమంటున్నారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి/ గుర్రంకొండ: అధికారంలోకి రాగానే డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానంటూ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విస్తృతంగా ప్రచారం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. జూన్ 8న సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు రుణాల మాఫీపై విధి విధానాల రూపకల్పన కోసం కమిటీని వేసేందుకు మాత్రమే సంతకం చేశారు. పంట రుణాల మాఫీపై విధివిధానాల రూపకల్పనకు కోటయ్య కమిటీ కసరత్తు చేస్తోంది. కానీ.. డ్వాక్రా రుణాల మాఫీపై కోటయ్య కమిటీ ఇప్పటిదాకా ప్రాథమిక నివేదిక కూడా ఇవ్వలేదు. రుణాల మాఫీపై స్పష్టత ఇవ్వకపోవడంతో బ్యాంకర్లు మహిళా సంఘాల పొదుపు ఖాతాలో నుంచి కంతులకు డబ్బు జమ చేసుకుంటున్నారు. రూ.1611.03 కోట్ల మాఫీపై స్పష్టత ఏదీ..? జిల్లాలో 61,711 స్వయం సహాయక సంఘాలు(ఎస్‌హెచ్‌జీ) ఉన్నాయి. ఇందులో 6.45 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. మార్చి 31, 2014 నాటికి 61,711 స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు రూ.1611.03 కోట్లను బ్యాంకులకు బకాయిపడ్డారు. ఆ రుణాల మాఫీపై చంద్రబాబు ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించలేదు. మహిళా సంఘానికి రూ.50 వేల వరకూ మాఫీ చేస్తామని ఒకసారి.. రుణమాఫీ కాదు ఒక్కో మహిళా సంఘానికి రూ.50 వేల వరకూ ప్రోత్సాహకం కింద ఇస్తామని మరొకసారి ప్రభుత్వం మీడియాకు లీకులు ఇస్తోంది తప్ప దేనిపైనా స్పష్టత ఇవ్వడం లేదు. పాత రుణాలు మాఫీ కాకపోవడంతో మహిళలకు కొత్తగా రుణాలు ఇవ్వడం లేదు సరి కదా.. వారు పొదుపు చేసుకున్న మొత్తంలో నుంచి వారికి తెలియకుండానే బ్యాంకర్లు కంతుల కింద జమా చేసుకుంటున్నారు. గుర్రంకొండ, వి.కోట, శాంతిపురం, పాలసముద్రం, ఏర్పేడు తదితర మండలాల్లో అధికశాతం బ్యాంకుల్లో ఈ తరహాలో డ్వాక్రా రుణాల వసూళ్లకు అధికారులు దిగడం గమనార్హం. నిబంధనలు బేఖాతరు.. రుణాల వసూళ్లలో బ్యాంకు అధికారులు నిబంధనలను ఖాతరు చేయడం లేదు. సీఐఎఫ్ నిధి నుంచి గ్రామ సమాఖ్యల తీర్మానం లేకుండా ఒక్క రూపాయి కూడా బ్యాంకర్లు అప్పు కింద జమ చేసుకోవడానికి లేదు. కానీ, ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే వారి పొదుపు మొత్తం(సీఐఎఫ్) నుంచి కంతుల మొత్తాన్ని బ్యాంకర్లు మినహాయించుకుంటున్నారు. చాప కింద నీరులా బ్యాంకర్లు రుణాల వసూళ్లకు దిగడంతో సీఐఎఫ్ నిధి ఏ మేరకు ఉందన్నది అంతుచిక్కడం లేదు. డీఆర్డీఏ-ఐకేపీ అధికారుల అంచనాల ప్రకారం సీఐఎఫ్ నిధి రూ.196 కోట్ల వరకూ ఉంటుందని సమాచారం. ఇప్పుడు వంద కోట్లకు మించి ఉండే అవకాశం లేదని ఆ శాఖ అధికారులే అంగీకరిస్తున్నారు. రుణాల మాఫీపై చంద్రబాబు ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడం వల్లే బ్యాంకర్లు నిబంధనలను ఉల్లంఘించి సీఐఎఫ్ నుంచి అప్పుల కింద మొత్తాన్ని జమ చేసుకుంటున్నారనే అభిప్రాయం అధికారవర్గాల్లో వ్యక్తమవుతోంది. రుణమాఫీపై ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరుపై మహిళలు మండిపడుతున్నారు. తక్షణమే స్పష్టమైన విధానం ప్రకటించి రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కంతుల కింద కట్ చేసుకున్న పొదుపు మొత్తాన్ని తమ ఖాతాల్లో జమ చేయకపోతే ఉద్యమిస్తామని మహిళా సంఘాలు హెచ్చరిస్తున్నాయి. మా డబ్బు డ్రా చేసుకోనీ లేదు మేము స్థానిక వైశ్యాబ్యాంకులో 2013 జూన్‌లో రూ.5 లక్షలు డ్వాక్రా రుణం తీసుకున్నాం. నెలకు 2 వేలు చొప్పున 17 నెలలు 34 వేలు రుణం తిరిగి చెల్లించాం. చంద్రబాబు డ్వాక్రారుణాలు చెల్లించవద్దని ప్రకటించడంతో రెండు నెలలుగా కంతులు చెల్లించలేదు. మా పొదుపు ఖాతాలో 87,750 ఉంది. బ్యాంకు అధికారులు మే, జూన్ నెలలకు కలిపి రూ.37,500 అప్పు కింద జమ చేసుకున్నారు. తక్కిన సొము డ్రా చేసుకుందావుంటే బకాయిలు చెల్లించేంత వరకు డ్రా చేసుకోనివ్వబోవుని చెబుతున్నారు. -పి.హేవులత, స్వాతి వుహిళావుండలి లీడర్, గుర్రంకొండ దిక్కున్నచోట చెప్పుకోమన్నారు మేము 2013 జూన్‌లో స్థానిక వైశ్యాబ్యాంకులో రూ.3.50 లక్షలు డ్వాక్రా రుణం తీసుకొన్నాం. నా వాటాకు రు.35 వేలు వచ్చింది. నెలకు 1200 చొప్పన 15 నెలలపాటు రుణం తిరిగి చెల్లించాం. చంద్రబాబు ఎన్నికల హామీని దృష్టిలో ఉంచుకుని రెండునెలలుగా రుణాలు చెల్లించలేదు. వూ పొదుపు ఖాతాలో ఉన్న 39 వేలలో నుంచి మే, జూన్ నెలలకు కలిపి 16,700 బ్యాంకు అధికారులే డ్రా చేసి అప్పు కింద జమ చేసుకున్నారు. ఇదేమని అడిగితే దిక్కున్నచోట చెప్పుకోమంటున్నారు. -పి.సరస్వతి, జ్యోతి వుహిళావుండలి లీడర్, గుర్రంకొండ ఇంతకన్నా మోసం ఉంటుందా? మేము 2013 జనవరిలో స్థానిక వైశ్యాబ్యాంకులో రూ.5లక్షలు డ్వాక్రా రుణం తీసుకొన్నాం. నా వాటాకు 50 వేలు వచ్చింది. నెలకు 2100 చొప్పన 17 నెలలు రుణం తిరిగి చెల్లించాం. చంద్రబాబు హామీతో మేము గత నెలలో వూత్రమే రుణం చెల్లించలేదు. బ్యాంకు వారు వూ పొదుపు ఖాతాలో నుంచి జూన్‌లో రూ.18 వేలు జమ చేసుకున్నారు. రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఆ మాటే పట్టించుకోవడం లేదు. ఇంతకన్నా మోసం మరొకటి ఉండదు. -రెడ్డిలక్ష్మి, ఇందిరా వుహిళావుండలి లీడర్, గుర్రంకొండ