జయకేమో పదివేల చీరలు, మరీ గాంధీజీకి...
హైదరాబాద్ : నిత్యం వార్తల్లో ఉండే ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ తన మనసులో ఉన్న అనుమానాలను మరోసారి ట్విట్టర్లో పెట్టారు. గాంధీజీ బతికి ఉంటే ఎవరిని సపోర్ట్ చేసేవారు. అలా అయితే నరేంద్ర మోడీ గెలిచేవాడా, గాంధీజీ ఏమో తక్కువ బట్టలు ధరిస్తే...జయలలితకేమో పదివేల చీరలా అంటూ ఆయన ట్విట్ చేశారు. రాంగోపాల్ వర్మ చేసిన ట్విట్స్ కొన్ని.....
* నాకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. గాంధీజీ దేశానికి స్వాతంత్ర్యం ఇచ్చాడా? దేశం గాంధీజీకి స్వాతంత్ర్యం ఇచ్చిందా?
* ఇద్దరు నేతల గురించి కంపేర్ చేసుకుంటే.... గాంధీజీకి ఆల్మోస్ట్ నో క్లోత్స్... అదే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు మాత్రం పదివేల చీరలు.
* ఒకవేళ గాంధీజీ గనుక బతికుంటే ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆయన ఏ పార్టీ తరపున ప్రచారం చేసేవారు. కాంగ్రెస్ తరపునా లేక బీజేపీ తరపున?
* గాంధీజీ కనుక సోనియా గాంధీ, లేదా రాహుల్ కు మద్దతుగా ప్రచారం చేసివుంటే నరేంద్ర మోడీ గెలిచేవారా?
* గాంధీజీ ఆశయాలను పదిమంది నాయకులు అయినా అనుసరించి ఉంటే దేశం అభివృద్ధిలో ఎక్కడో ఉండేది.