
శ్రీమతి సిల్క్‌మార్క్-2014 పోటీలకు దరఖాస్తుల ఆహ్వానం
సిల్క్‌మార్క్ ఎగ్జిబిషన్ సందర్భంగా ఈ ఏడాది ‘శ్రీమతి సిల్క్‌మార్క్-2014’ పోటీలు నిర్వహించనున్నారు.
సిల్క్‌మార్క్ ఎగ్జిబిషన్ సందర్భంగా ఈ ఏడాది ‘శ్రీమతి సిల్క్‌మార్క్-2014’ పోటీలు నిర్వహించనున్నారు. ప్రశాసన్‌నగర్‌లోని పట్టుపరిశ్రమ శాఖ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిల్క్‌మార్క్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా డిప్యూటీ సెక్రటరీ సతీశ్‌కుమార్, ఎగ్జిక్యూటివ్ శ్రీనివాస్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రామలక్ష్మి ఈ పోటీల వివరాలను వెల్లడించారు. ‘శ్రీమతి సిల్క్‌మార్క్-2014’ పోటీలకు సెప్టెంబర్ 13 నుంచి ఆడిషన్స్ ప్రారంభమవుతాయి.
శిల్పకళావేదికలో సెప్టెంబర్ 26న గ్రాండ్ ఫైనల్స్ జరుగుతాయి. ఈ కార్యక్రమంలో 22-40 ఏళ్ల లోపు వయసు గల శ్రీమతులందరూ పాల్గొనవచ్చు. పట్టువస్త్రాలు, సిల్క్‌మార్క్ ప్రాముఖ్యతపై గల అవగాహన, సంప్రదాయ దుస్తులపై గల అభిరుచి తదితర అంశాల ఆధారంగా విజేతలను ఎంపిక చేస్తారు. ఇందులో భాగంగానే చిన్నారులకు చిత్రలేఖనం, వ్యాసరచన తదితర పోటీలు, ఫ్యాషన్ షో నిర్వహించనున్నారు. ఈ ప్రదర్శనలో దేశంలోని 15 రాష్ట్రాలకు చెందిన 200 రకాలకు పైగా పట్టు వస్త్రాలు కొలువుదీరనున్నాయి.
- బంజారాహిల్స్