
తెలంగాణలో గంజాయి, డ్రగ్స్ నిరోధానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు పర్యాటక, సాంస్కృతిక శాఖమంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.

మాదాపూర్‌లోని శిల్పకళావేదికలో బుధవారం యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యా ల వ్యతిరేక దినోత్సవం నిర్వహించారు.

కార్యక్రమా న్ని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కలు ప్రారంభించారు.

మాదక ద్రవ్యాల నిరోధంపై అవగాహన కల్పించేందుకు బ్రోచర్లు, పాటలు, వీడియోను విడుదల చేశారు.

కార్యక్రమంలో తెలంగాణ డీజీపీ రవిగుప్తా, సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మొహంతి, నార్కోటిక్స్ విభాగం సందీప్ శాండిల్య, క్రీడాకారిణి మిథాలీరాజ్, నటుడు తేజ సజ్జ తదితరులు పాల్గొన్నారు











