![Fan Died With Heart Attack During RRR Movie Watching - Sakshi](/styles/webp/s3/article_images/2022/03/25/RRR1.jpg.webp?itok=1UbZUjoS)
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌లు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం)'. దర్శదీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బెనిఫిట్ షోలు చూసేందుకు పలు ప్రాంతాల్లో అభిమానులు ఎగబడ్డారు. ఇదిలా ఉండగా ఆర్‌ఆర్‌ఆర్ సినిమా చూస్తూ ఓ అభిమాని ప్రాణాలు కోల్పోయాడు.
అనంతపురానికి చెందిన ఓబులేసు(30) అనే వ్యక్తి బెనిఫిట్ షో చూస్తుండగా గుండెపోటుకు గురయ్యాడు. సమీపంలోని ఆసుపత్రికి తరలించేలోపు మార్గమధ్యలోనే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తమ అభిమాన హీరో సినిమా దృశ్యాలను చిత్రీకరిస్తూ ఓబులేసు కుప్పకూలిపోయినట్లు అతడి స్నేహితులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment