'మెగా' హీరో మంచి మనసు..అభిమాని కుటుంబానికి సాయం | Varun Tej Donates Two Lakh Rupees To Demised Fan | Sakshi
Sakshi News home page

Varun Tej : అభిమాని కుటుంబానికి వరుణ్‌తేజ్‌ సాయం

Published Mon, Jul 19 2021 11:23 AM | Last Updated on Mon, Jul 19 2021 12:14 PM

Varun Tej Donates Two Lakh Rupees To Demised Fan - Sakshi

మెగా హీరో వరుణ్‌ తేజ్‌ మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. కరోనా కారణంగా మరణించిన అభిమాని కుటుంబానికి సాయం అందించారు. వివరాల ప్రకారం..కరీంనగర్‌కు చెందిన శేఖర్‌ అనే అభిమాని ఇటీవలె కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న వరుణ్‌తేజ్‌ ఆ కుటుంబానికి 2లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు.

ఈ మేరకు శేఖర్‌ తల్లికి కరీంనగర్‌ జిల్లా మెగాఫ్యామిలీ ఫ్యాన్స్‌ జిల్లా అధ్యక్షుడు వేల్పుల వెంకటేశ్‌ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా శేఖర్‌ కుటుంబం వరుణ్‌తేజ్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఇక సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం వరుణ్‌తేజ్‌ ఎఫ్‌3, గని చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాల షూటింగుల్లో వరుణ్‌ బిజీగా ఉన్నారు. గని చిత్రంలో వరుణ్‌ బాక్సర్‌గా కనిపించనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement