
ఎన్టీఆర్ వీరాభిమాని చనిపోయాడు. గత కొంతకాలంగా క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతున్న కౌశిక్ అనే కుర్రాడు.. గతేడాది 'దేవర' రిలీజ్ సందర్భంగా మీడియా ముందుకొచ్చాడు. ఇతడి తల్లి అభ్యర్థన మేరకు స్వయంగా ఎన్టీఆర్ వీడియో కాల్ కూడా మాట్లాడాడు. ఇప్పుడు ఆ అభిమాని ఇంట్లో విషాదం నెలకొంది.
(ఇదీ చదవండి: నా సోదరి మరణం.. ఇప్పటికీ మరిచిపోలేను: చిరంజీవి)
తిరుపతికి చెందిన కౌశిక్.. జూ.ఎన్టీఆర్ కి వీరాభిమాని. డిగ్రీ చదువుతున్నప్పుడు ఓసారి జ్వరం రావడంతో పలు ఆస్పత్రుల్లో చూపించగా క్యాన్సర్ ఉందని వైద్యులు ధ్రువీకరించారు. దీంతో చివరగా తన అభిమాన హీరో నటించిన 'దేవర' చూసేంతవరకు బ్రతకాలనుకుంటున్నట్లు చెప్పాడు.
ఈ క్రమంలోనే కౌశిక్ వీడియో.. పలువురు అభిమానుల ద్వారా ఎన్టీఆర్ వరకు వెళ్లింది. అలా గతేడాది 'దేవర' విడుదలకు ముందు స్వయంగా ఎన్టీఆర్.. కౌశిక్ తో వీడియో కాల్ మాట్లాడాడు. వైద్యానికి కావాల్సిన సాయం చేస్తానని మాట కూడా ఇచ్చాడు. తర్వాత కౌశిక్ వైద్యం కోసం టీటీడీ రూ40 లక్షలు, ప్రభుత్వం రూ.11 లక్షలు, తారక్ అభిమానులు రూ. 10 లక్షలు విరాళంగా ఇచ్చినట్లు అప్పట్లోనే వార్తలొచ్చాయి.
(ఇదీ చదవండి: 'రేఖాచిత్రం' సినిమా రివ్యూ (ఓటీటీ))

ఇది జరిగిన కొన్నాళ్లకు అంటే డిసెంబరులో అలా కౌశిక్ తల్లి ప్రెస్ మీట్ పెట్టి తమకు ఎన్టీఆర్ ఏం సాయం చేయలేదని చెప్పారు. దీంతో తారక్ ఫ్యాన్స్ వెళ్లి ఆమెతో మాట్లాడించి క్లారిటీ ఇవ్వడం లాంటివి జరిగాయి.
అలా కాస్తోకూస్తో వార్తల్లో నిలిచిన కౌశిక్ కొన్నాళ్ల క్రితమే ఆస్పత్రి నుంచి కూడా డిశ్చార్జ్ అయిపోయాడు. ఇప్పుడు అతడు అనారోగ్యంతో చనిపోయాడు. తారక్ తో వీడియో కాల్ అయితే మాట్లాడాడు కానీ కలవడం అనే చివరి కోరిక తీరకుండానే తుదిశ్వాస విడిచాడని తోటి ఎన్టీఆర్ అభిమానులు అంటున్నారు.
(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 34 సినిమాలు))