కాలిపోయిన కరెన్సీ నోట్లు
సాక్షి, సేలం: విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్ని ప్రమాదంలో రూ. 6 లక్షల నగదు బుగ్గిపాలైంది. ఈరోడ్ జిల్లా గోపిచెట్టి పాళ్యం, భారతి వీధికి చెందిన వ్యక్తి మొహ్మద్ ఇలియాస్. ఈయన సమీపంలోని మార్కెట్ ప్రాంతంలో కిరాణా దుకాణం నడుపుతున్నాడు. ఈయనకు 13 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ఎప్పటిలానే మంగళవారం ఉదయం కుమారుడిని ఇంటిలో ఉంచి భార్య, భర్త ఇద్దరూ వ్యాపారానికి వెళ్లారు.
ఆ సమయంలో ఇంటి నుంచి కేకలు వినిపిండంతో స్థానికులు తలుపు తెరచి చూడగా ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. మొహ్మద్ ఇలియాస్ కుమారుడిని రక్షించారు. సమాచారం అందుకున్న గోపిచెట్టి పాళ్యం అగ్ని మాపక సిబ్బంది గంట పాటు పోరాడి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో రూ. 6 లక్షల నగదు, నగలు మొత్తం రూ. 10 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు వాపోయాడు. పోలీసుల విచారణలో ఏసీ పేలిపోయి అగ్ని ప్రమాదం సంభవించినట్టు తెలిసింది. చదవండి: ఆయనే లేకుంటే రక్తం ఏరులై పారేది..
Comments
Please login to add a commentAdd a comment