
సేలం: అత్తారింటికి కారులో వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి, పెద్దకూతురు మృతిచెందారు. ప్రమాదంలో తల్లీ, చిన్నకూతురు గాయపడ్డారు. ఈ సంఘటన ఆత్తూరు సమీపంలో శనివారం జరిగింది. వివరాలు.. చెన్నై ముగప్పేర్ ప్రాంతానికి చెందిన పార్తిబన్ (49) దుబాయ్‌లో పనిచేస్తున్నాడు. గతవారం క్రితమే సెలవులకు వచ్చాడు. పార్తిబన్‌కు భార్య కవిత (42), పెద్ద కుమార్తె దర్శిని (19), చిన్న కుమార్తె దీక్ష (14). కవిత, ఇద్దరు కుమార్తెలతో చెన్నై నుంచి సేలంలో ఉన్న అత్తగారింటికి కారులో బయలుదేరారు. కారును పార్తిబన్ నడిపాడు. కారు శనివారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో సేలం జిల్లా ఆత్తూరు సమీపంలోని పులుక్కానూర్ వద్ద వస్తోంది.
అప్పుడు జాతీయ రహదారిపై ఉన్న వంతెను ఎక్కబోయి అదుపు తప్పి గోడను ఢీకొంది. దీంతో కారులో మంటలు చెలరేగాయి. సమాచారంతో ఆత్తూరు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే పార్తిబన్, పెద్ద కుమార్తే దర్శిని సంఘటన స్థలంలోనే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన కవిత, దీక్షలను సేలం జీహెచ్‌కు తరలించారు. అనంతరం పోలీసులు మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆత్తూరు జీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment