సాక్షి, గాంధీగనర్(విజయవాడసెంట్రల్): విజయవాడ నగరానికి చెందిన మున్నంగి హాసిని వయస్సు పదేళ్లు. ఐకాన్ పబ్లిక్ స్కూల్‌లో ఐదో తరగతి చదువుతోంది. తన అద్భుతమైన జ్ఞాపకశక్తితో అందరినీ అబ్బురపరుస్తోంది. సూపర్ స్టార్ కృష్ణ నటించిన 346 చిత్రాల పేర్లను కేవలం 5 నిమిషాల వ్యవధిలో వరుస క్రమంలో చెబుతోంది చిన్నారి హాసిని. కృష్ణ తొలిచిత్రం ‘తేనె మనుసులు’ నుంచి చివరిచిత్రం వరకు నాన్ స్టాప్‌గా పేర్లు చెప్పి తన ప్రతిభను చాటుకుంది. సరిలేరు నీకెవ్వరు చిత్ర విజయోత్సవం సందర్భంగా ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తండ్రి 350 చిత్రాల్లో నటించారని, ఆ చిత్రాల పేర్లు వరుసగా ఎవరైనా చెప్పగలరా? అనే మహేష్ మాటలతో స్ఫూర్తి పొందిన హాసిని వారం రోజుల వ్యవధిలో సినిమా పేర్లను కంఠస్తం చేసింది.
అలంకార్ థియేటర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సినిమా పేర్లు చెబుతున్న చిన్నారి హాసిని
పలువురి ప్రశంసలు..
సూపర్‌స్టార్ కృష్ణ నటించిన చిత్రాలను 5 నిమిషాల వ్యవధిలో చెప్పిన చిన్నారి హాసినిని పలువురు అభినందించారు. సత్యనారాయణపురం పోలీస్‌స్టేషన్ సీఐ బాలమురళి, ఆల్ ఇండియా సూపర్‌స్టార్ కృష్ణ, మహేష్‌బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సుధాస్వామి, తాడి శివ, ఏ1 రెడ్డి, టైలర్‌బాబు చిన్నారిని అభినందించారు.
మహేష్‌బాబుకు పుట్టినరోజు కానుకగా ఇవ్వాలనే.. : హాసిని
ప్రిన్స్ మహేబాబు వెయ్యిమంది చిన్నారులకు గుండె ఆపరేషన్ చేయించి కొత్త జీవితాన్ని ఇచ్చారు. వారి ముఖాల్లో చిరునవ్వులు పూయించారు. చిన్నారుల తరపున మహేష్‌బాబుకు పుట్టిన రోజు కానుకగా ఏదైనా కానుక ఇవ్వాలని భావించాను. సూపర్‌స్టార్ కృష్ణ నటించిన చిత్రాల మాలికను ఆయనకు అందిస్తున్నాను.
Comments
Please login to add a commentAdd a comment