Former Miss Telangana Hasini Committed Suicide Again In Krishna District - Sakshi
Sakshi News home page

Miss Telangana 2018 Winner: హాసిని మళ్లీ ఆత్మహత్యాయత్నం.. 

Published Sat, Oct 30 2021 4:21 AM | Last Updated on Sat, Oct 30 2021 11:13 AM

Former Miss Telangana Hasini Committed Suicide Again In Krishna District - Sakshi

కంచికచర్ల (నందిగామ): ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించిన మోడల్, మిస్‌ తెలంగాణ–2018 కలక భవానీ అలియాస్‌ హాసిని మరోసారి ఆత్మహత్యా యత్నం చేసింది. కృష్ణా జిల్లా కంచికచర్ల సమీపంలోని కీసర బ్రిడ్జి పైనుంచి మున్నేరు వాగులోకి దూకి శుక్రవారం ఆత్మహత్యకు యత్నించింది. కృష్ణా జిల్లా వీరులపాడు మండలం బోడవాడ గ్రామానికి చెందిన హాసిని హైదరాబాద్‌ హిమాయత్‌నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తోంది.

బుధవారం రాత్రి హైదరాబాద్‌లో ఇస్టాగ్రామ్‌లో లైవ్‌ ప్రారంభించి చున్నీతో ఉరేసుకుని చనిపోవాలని ప్రయత్నించగా, ఆమె స్నేహితుడు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఆమెను కాపాడారు. అయితే గురువారం ఆమె కుటుంబసభ్యులతో హైదరాబాద్‌ నుంచి బోడవాడకు వచ్చింది. శుక్రవారం మున్నేరు వాగులోకి దూకి మరోసారి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది. గమనించిన స్థానికులు ఆమెను రక్షించారు. నేషనల్‌ హైవే అంబులెన్స్‌లో నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
(చదవండి: జియాగూడ: పెళ్లయిన నాటి నుంచి గొడవలే.. తట్టుకోలేక..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement