‘దేవదాస్‌’ ఫస్ట్‌ లుక్‌.. నాని, నాగ్‌ల ట్వీట్స్‌ వైరల్‌! | Nagarjuna And Nani Multi Starrer Devdas First Look Out | Sakshi
Sakshi News home page

Published Tue, Aug 7 2018 5:07 PM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

Nagarjuna And Nani Multi Starrer Devdas First Look Out - Sakshi

టాలీవుడ్‌లో దేవదాస్‌ సినిమాకు ప్రత్యేకస్థానం ఉంటుంది. ఏఎన్నార్‌ నటన ఆ సినిమాకు ప్లస్‌. ఓ క్లాసిక్‌గా నిలిచిన ఆ సినిమా టైటిల్‌ను నాగార్జున, నాని కాంబినేషన్‌లో రాబోతోన్న సినిమాకు పెట్టడమంటే సాహసమే. అయితే అందుకు తగ్గట్టుగా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు సమాచారం.

తాజాగా ‘దేవదాస్‌’ ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేశారు. ఈ లుక్‌ను రిలీజ్‌ చేస్తూ.. నాగ్‌, నానిలు చేసిన ట్వీట్స్‌ వైరల్‌ అవుతున్నాయి. ‘ నా పక్కన ఎప్పుడూ పారు ఉండాలి. కానీ ఈ సారి మాత్రం దాస్‌తో ఉండిపోయాను. ఇది సరదాగా ఉండబోతోందం’టూ ట్వీట్‌ చేశారు. ఇక నాని.. ‘ 1996లో నిన్నే పెళ్లాడతా సినిమా టైమ్‌లో నాగ్‌ సర్‌ తెరపై ఉన్నారు. నేను దేవి థియేటర్‌లో క్యూలో ఉన్నాను. 2018లో దేవ్‌దాస్‌లో మేమిద్దరం ఇలా తాగి పడుకున్నామం’టూ ట్వీట్‌ చేశాడు. వైజయంతీ మూవీస్‌ నిర్మిస్తోన్న ఈ మూవీకి శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement