'సుచిత్ర' అసలు సిసలు అందానికి చిరునామా
ప్రముఖ నటి సుచిత్ర సేన్ మృతి చలన చిత్ర ప్రపంచానికి తీరని లోటని ప్రముఖ ఎన్నారై పారిశ్రామికవేత్త లార్డ్ స్వరాజ్ పాల్ అన్నారు. అందాని అసలు సిసలు చిరునామా సుచిత్ర అని ఆయన అభివర్ణించారు. అత్యంత ప్రతిభ పాటవాలు ఆమె సొంతమని పేర్కొన్నారు. బెంగాలి నటి అయిన సుచిత్ర సేన్ అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన నటిమణిగా పేరు ప్రఖ్యాతలు పొందారన్నారు. ప్రపంచ ప్రేక్షకుల మదిలో సుచిత్ర చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు.
ఆమె నటించిన దేవదాసు.. చిత్రాలు అద్భుత కళాఖండాలని కొనియాడారు. ప్రముఖ నటీ సుచిత్ర సేన్ శుక్రవారం కొల్కత్తాలో మరణించారు. ఆమె వయస్సు 82 సంవత్సరాలు. గత కొద్ది రోజులుగా ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో గత మూడు వారాల క్రితం ఆమెను కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సుచిత్ర శుక్రవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. బెంగాలీలో అగ్నిపరీక్ష, సప్తపది, దీప జ్వాల జై, సాత్ పాకీ బందా తదితర 50 చిత్రాలకు పైగా హీరోయిన్ గా నటించించారు. అలాగే హిందీలో దేవదాసు, అందీ చిత్రాలలో నటించి ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోయారు.