Lord Swraj Paul
-
'కలాం గొప్ప మానవతావాది'
లండన్: ప్రఖ్యాత శాస్త్రవేత్త, భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం మృతి పట్ల ప్రముఖ ఎన్నారై పారిశ్రామికవేత్త లార్డ్ స్వరాజ్ పాల్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అబ్దుల్ కలాంకు ఘనంగా నివాళులర్పించారు. ఆయన గొప్ప మానవతావాది అని తెలిపారు. ఎందరికో స్ఫూర్తి ప్రధాత అని అబ్దుల్ కలాంను కొనియాడారు. రాష్ట్రపతిగా కలాం దేశానికి చేసిన సేవలను లార్డ్ స్వరాజ్ పాల్ ఈ సందర్భంగా కొనియాడారు. అబ్దుల్ కలాం ప్రసిద్ధ నాయకుడని లార్డ్ స్వరాజ్ పాల్ తెలిపారు. లండన్ చెందిన ప్రముఖ ఎన్నారై పారిశ్రామికవేత్తగా ఖ్యాతి పొందిన లార్డ్ స్వరాజ్ పాల్ కపారో గ్రూప్ సంస్థలకు అధినేత అన్న విషయం తెలిసిందే. -
తీవ్రవాదుల చేతుల్లోకి నల్లధనం: స్వరాజ్ పాల్
లండన్: నల్లధనం తీవ్రవాదుల చేతుల్లోకి వెళుతోందని ప్రవాస భారతీయ పారిశ్రామికవేత్త, కపారో గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధిపతి లార్డ్ స్వరాజ్ పాల్ ఆందోళన వ్యక్తం చేశారు. నల్లధనం వల్ల కలిగే నష్టాలను చాలా దేశాలు ఇప్పుడు గుర్తించాయని అన్నారు. నల్లధనం తీవ్రవాదుల చేతుల్లోకి వెళ్లడం వలన కలిగే విపరిణామాలపై కళ్లు తెరిచాయని పేర్కొన్నారు. ఇకనైనా నల్లధనంపై పోరును ఉధృతం చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. విదేశాల్లో భారతీయులు అక్రమంగా దాచిన సొమ్మును నరేంద్ర మోదీ ప్రభుత్వం వెనక్కు తీసుకొచ్చేందుకు చేపడుతున్న చర్యలపై స్వరాజ్ పాల్ స్పందించారు. నల్లధనం ఏ ఒక్క దేశానికో సంబంధించిన సమస్య కాదన్నారు. బ్లాక్‌మనీ నిర్మూలనకు అన్నిదేశాలు కలిసిరావాలని కోరారు. -
స్వరాజ్‌పాల్‌కు జీవిత సాఫల్య పురస్కారం
లండన్: బ్రిటన్‌కు చెందిన ప్రముఖ ఎన్ఆర్ఐ పారిశ్రామికవేత్త లార్డ్ స్వరాజ్‌పాల్‌కు ఏషియన్ బిజినెస్ అసోసియేషన్ జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేసింది. పరిశ్రమలు, విద్య తదితర రంగాలకు పాల్ చేసిన సేవలకుగాను ఈ పురస్కారం లభించింది. ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో స్వరాజ్‌పాల్ తరఫున ఆయన కుమార్తె అంజలి ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా పాల్ పంపిన సందేశాన్ని ఆమె చదివి వినిపించారు. -
'సుచిత్ర' అసలు సిసలు అందానికి చిరునామా
ప్రముఖ నటి సుచిత్ర సేన్ మృతి చలన చిత్ర ప్రపంచానికి తీరని లోటని ప్రముఖ ఎన్నారై పారిశ్రామికవేత్త లార్డ్ స్వరాజ్ పాల్ అన్నారు. అందాని అసలు సిసలు చిరునామా సుచిత్ర అని ఆయన అభివర్ణించారు. అత్యంత ప్రతిభ పాటవాలు ఆమె సొంతమని పేర్కొన్నారు. బెంగాలి నటి అయిన సుచిత్ర సేన్ అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన నటిమణిగా పేరు ప్రఖ్యాతలు పొందారన్నారు. ప్రపంచ ప్రేక్షకుల మదిలో సుచిత్ర చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. ఆమె నటించిన దేవదాసు.. చిత్రాలు అద్భుత కళాఖండాలని కొనియాడారు. ప్రముఖ నటీ సుచిత్ర సేన్ శుక్రవారం కొల్‌కత్తాలో మరణించారు. ఆమె వయస్సు 82 సంవత్సరాలు. గత కొద్ది రోజులుగా ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో గత మూడు వారాల క్రితం ఆమెను కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సుచిత్ర శుక్రవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. బెంగాలీలో అగ్నిపరీక్ష, సప్తపది, దీప జ్వాల జై, సాత్ పాకీ బందా తదితర 50 చిత్రాలకు పైగా హీరోయిన్ గా నటించించారు. అలాగే హిందీలో దేవదాసు, అందీ చిత్రాలలో నటించి ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోయారు. -
ఇందిర అద్భుతమైన వ్యక్తి
భారత మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ అద్భుతమైన వ్యక్తి అని ప్రముఖ ఎన్నారై పారిశ్రామికవేత్త లార్డ్ స్వరాజ్ పాల్ అభివర్ణించారు. ఆమెను చూసి భారత్ గర్వపడుతుందని తెలిపారు. అలాగే భారతీయుల గౌరవానికి ఇందిర ప్రతీక అని పేర్కొన్నారు. ఆమె వ్యక్తిత్వం ఆమోఘమని కొనియాడారు. రాబోయే రోజుల్లో అలాంటి స్త్రీమూర్తి కనిపించకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ఇందిరాగాంధీ 96వ జయంతి సందర్భంగా మంగళవారం లండన్‌లోని నెహ్రూ సెంటర్లో ఏర్పాటు చేసిన ఆమె ఫోటో ఎగ్జిబిషన్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఇందిర గాంధీతో తమకు గల అనుబంధాన్ని ఆయన ఈ సందర్బంగా వివరించారు. ఆ క్రమంలో పాల్ భార్య అరుణ పాల్ మాట్లాడుతూ... ఇందిరాగాంధీ హత్య జరిగినప్పుడు తాను స్వయంగా సోనియాను కలశానని ఆమె గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో సోనియా తనకు అందజేసిన శాలువా నేటిని తన వద్ద భద్రంగా ఉందని అరుణ వెల్లడించారు. తన వద్ద ఉన్న అత్యంత అరుదైన వాటిలో ఆ శాలువా ఒకటని లార్డ్ స్వరాజ్ పాల్ భార్య అరుణ పాల్ వెల్లడించారు. 1971లో భారత్, పాక్ దేశాల మధ్య యుద్ద సమయంలో ఇందిరపై మేరిలిన్ స్టాఫర్డ్ తీసిన ఫోటోలతోపాటు ఇందిర, రాజీవ్,సోనియా, సంజయ్ గాంధీల ఫోటోలను ఆ ప్రదర్శనలో ఉంచారు. -
పై-లీన్ బాధితులకు లార్డ్ స్వరాజ్ పాల్ ఆర్థిక సాయం
ప్రముఖ ఎన్నారై పారిశ్రామికవేత్త లార్డ్ స్వరాజ్ పాల్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. పై-లీన్ తుపాన్ వల్ల తీవ్రంగా నష్టపోయిన బాధితలకు పునరావాసం, సహాయక చర్యల కోసం రూ. 25 లక్షలు ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు ప్రకటించారు. ఆదివారం లండన్‌లోని తన నివాసంలో లార్డ్ స్వరాజ్ పాల్ విలేకర్లతో మాట్లాడుతూ... పై-లీన్ తుపాన్ నేపథ్యంలో భారత ప్రభుత్వం వ్యవహారించిన తీరు నభూతోనభవిష్యత్తు అని ప్రశంసించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాలా అప్రమత్తంగా ఉన్నాయని తెలిపారు. అత్యంత భీకరమైన ఆ తుపాన్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమర్థవంతంగా ఎదుర్కొన్నాయన్నారు. వీటితోపాటు భారత ఆర్మీ, వైమానిక దళాలు సహాయక చర్యలపై స్వరాజ్ పాల్ ప్రశంసల జల్లు కురిపించారు. అలాగే పై-లీన్ తుపాన్‌పై జాతీయ, స్థానిక మీడియాలు ప్రజలను అప్రమత్తం చేసిందని వివరించారు. అందువల్లే మృతులు కానీ గాయాలపాలైన వారు కాని చాలా తక్కువ మంది ఉన్నారని చెప్పారు. పై-లీన్ తుపాన్ దృశ్యాలను టీవీ ద్వారా వీక్షించినట్లు చెప్పారు. రూ. 25 లక్షల విరాళాన్ని సాధ్యమైనంత త్వరగా పై-లీన్ తుపాన్ బాధితులకు అందజేస్తామని లార్డ్ స్వరాజ్ పాల్ వివరించారు.