
'కలాం గొప్ప మానవతావాది'
లండన్: ప్రఖ్యాత శాస్త్రవేత్త, భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం మృతి పట్ల ప్రముఖ ఎన్నారై పారిశ్రామికవేత్త లార్డ్ స్వరాజ్ పాల్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అబ్దుల్ కలాంకు ఘనంగా నివాళులర్పించారు. ఆయన గొప్ప మానవతావాది అని తెలిపారు. ఎందరికో స్ఫూర్తి ప్రధాత అని అబ్దుల్ కలాంను కొనియాడారు.
రాష్ట్రపతిగా కలాం దేశానికి చేసిన సేవలను లార్డ్ స్వరాజ్ పాల్ ఈ సందర్భంగా కొనియాడారు. అబ్దుల్ కలాం ప్రసిద్ధ నాయకుడని లార్డ్ స్వరాజ్ పాల్ తెలిపారు. లండన్ చెందిన ప్రముఖ ఎన్నారై పారిశ్రామికవేత్తగా ఖ్యాతి పొందిన లార్డ్ స్వరాజ్ పాల్ కపారో గ్రూప్ సంస్థలకు అధినేత అన్న విషయం తెలిసిందే.