Suchitra Sen
-
తెరకెక్కుతున్న తారల జీవితాలు
ఇద్దరు ప్రముఖ కథానాయికల జీవితాల ఆధారంగా హిందీలో రెండు సంచలన చిత్రాలు రూపొందనున్నాయి. ఒకటేమో-ఒకప్పటి అగ్రకథానాయిక సుచిత్రాసేన్ జీవిత కథ కాగా, మరొకటి - బాలీవుడ్ నంబర్‌వన్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా లైఫ్ స్టోరీ.సుచిత్రా సేన్ హిందీలో ఎంత పాపులరో, బెంగాలీలో అంత కన్నా పాపులర్. ‘దేవదాస్’ లాంటి ఎన్నో కళాఖండాల్లో నటించిన సుచిత్ర ‘పద్మశ్రీ’ పురస్కారం కూడా అందుకున్నారు. సినిమాలు నటించడం మానేశాక మూడు దశాబ్దాలకు పైగా అజ్ఞాత జీవితం గడిపిన ఈ మహానటి మొన్న జనవరిలో కోల్‌కతాలో కన్ను మూశారు. ఎన్నో ఆసక్తికరమైన మలుపులతో కూడిన ఆమె జీవితాన్ని తెరకెక్కించాలని అభిజిత్ చౌదురి కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నారు. సుచిత్రాసేన్ను కలిసి చూచాయగా కథ కూడా వివరించారట. ఇప్పుడీ ఈ కథను ఆమె మనవరాలు రైమా సేన్‌తో తెరకెక్కిస్తున్నారు. రైమా సేన్ అంటే తెలుగులో తేజ దర్శకత్వంలో వచ్చిన ‘ధైర్యం’ చిత్రంలో కథానాయిక. నటి మూన్‌మూన్ సేన్ కూతురు. సుచిత్రాసేన్కి స్వయానా మనవరాలు. తెలుగులో ‘ధైర్యం’లో హీరోయిన్గా చేసిన అమ్మాయి. అమ్మమ్మ పాత్రను చేయడానికి రైమా తొలుత భయపడిందట. కానీ దర్శకుడు బలవంతంగా ఒప్పించారు. అందుకే రైమా తన అమ్మమ్మ నటించిన సినిమాలన్నీ చూస్తూ ఆ అభినయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. హిందీ, బెంగాలీల్లో రూపొందనున్న ఈ చిత్రానికి ‘నాయిక’ అని పేరు పెట్టారు. ఆగస్టు నుంచి షూటింగ్. ఇక ప్రియాంకా చోప్రా విషయానికొస్తే తను ఎన్నో కష్టాలుపడి ఈ స్థాయికి చేరుకున్నారు. అందం కన్నా అభినయాన్నే నమ్ముకున్న ప్రియాంక జీవితంలో ఎన్నో ఆసక్తికరమైన అంశాలున్నాయి. అవి ఆమె సన్నిహితులకు మాత్రమే తెలుసు. ఆమెకు తొలి రోజుల ప్రియుడు అశీమ్ మర్చంట్, ప్రియాంక కథతో సినిమా నిర్మించనున్నారు. ‘67 రోజులు’ పేరుతో రూపొందనున్న ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా పాత్రకు సాక్షి చౌదరిని ఎంపికచేశారు. ఈ సాక్షి తెలుగులో ఇటీవల ‘పోటు గాడు’ సినిమాలో నటించారు. ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది. అయితే ఈ సినిమా విషయంలో ప్రియాంక ఏమైనా అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశం ఉందంటున్నారు పరిశీలకులు. చూద్దాం ఏమవుతుందో! -
'సుచిత్ర' అసలు సిసలు అందానికి చిరునామా
ప్రముఖ నటి సుచిత్ర సేన్ మృతి చలన చిత్ర ప్రపంచానికి తీరని లోటని ప్రముఖ ఎన్నారై పారిశ్రామికవేత్త లార్డ్ స్వరాజ్ పాల్ అన్నారు. అందాని అసలు సిసలు చిరునామా సుచిత్ర అని ఆయన అభివర్ణించారు. అత్యంత ప్రతిభ పాటవాలు ఆమె సొంతమని పేర్కొన్నారు. బెంగాలి నటి అయిన సుచిత్ర సేన్ అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన నటిమణిగా పేరు ప్రఖ్యాతలు పొందారన్నారు. ప్రపంచ ప్రేక్షకుల మదిలో సుచిత్ర చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. ఆమె నటించిన దేవదాసు.. చిత్రాలు అద్భుత కళాఖండాలని కొనియాడారు. ప్రముఖ నటీ సుచిత్ర సేన్ శుక్రవారం కొల్‌కత్తాలో మరణించారు. ఆమె వయస్సు 82 సంవత్సరాలు. గత కొద్ది రోజులుగా ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో గత మూడు వారాల క్రితం ఆమెను కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సుచిత్ర శుక్రవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. బెంగాలీలో అగ్నిపరీక్ష, సప్తపది, దీప జ్వాల జై, సాత్ పాకీ బందా తదితర 50 చిత్రాలకు పైగా హీరోయిన్ గా నటించించారు. అలాగే హిందీలో దేవదాసు, అందీ చిత్రాలలో నటించి ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోయారు. -
సుచిత్రాసేన్ ఇకలేరు
కోల్‌కతా: తొలితరం ప్రఖ్యాత సినీ నటి సుచిత్రాసేన్ శుక్రవారం కోల్‌కతాలోని ఓ ఆస్పత్రిలో గుండెపోటుతో కన్నుమూశారు. ఆమె వయసు 82 సంవత్సరాలు. బెంగాలీ సినీ రంగపు గ్రెటా గార్బో (ప్రఖ్యాత హాలీవుడ్ నటి)గా పేరుగాంచిన సుచి త్రాసేన్ దాదాపు 60 సినిమాల్లో నటించారు. 1950ల నుంచి 1970ల వరకూ వెండితెర కథానాయకిగా వెలుగొందారు. దేవదాస్, ఆంధీ వంటి హిందీ సినిమాలు; సాత్ పాకే బంధా, అగ్నిపరీక్ష, సప్తపది, దీప్ జ్వలే జాయ్ వంటి బెంగాలీ సినిమాల్లో నటనతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్రవేశారు. ఆమె కొద్ది రోజుల కిందట అనారోగ్యానికి గురికాగా డిసెంబర్ 23వ తేదీన బెల్లే వ్యూ క్లినిక్‌లో చికిత్స కోసం చేర్చించారు. శుక్రవారం ఉదయం తీవ్ర గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు. దక్షిణ కోల్‌కతాలోని కియోరాటాలా శ్మశానవాటికలో అంత్యక్రియలు జరిగాయి. - దేవదాస్ సినిమాలో నటనకు సుచిత్రాసేన్ జాతీయ అవార్డును అందుకున్నారు. సాత్ పాకే బంధా సినిమాలో నటనకు 1963 మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్లో అంతర్జాతీయ అవార్డును అందుకున్న తొలి భారతీయ నటిగా రికార్డు సృష్టించారు. - 1978లో విడుదలైన ప్రణోయ్ పాషా సినిమా ఫ్లాప్ అయిన తర్వాత సుచిత్రాసేన్ ఏకాంతంలోకి వెళ్లిపోయారు. గత మూడు దశాబ్దాలుగా అతికొద్ది మంది సన్నిహితులతో తప్ప ఎవరితోనూ కలవలేదు. - బహిరంగ వేదికపైకి రావటం ఇష్టం లేనందువల్ల 2005లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కూడా సుచిత్ర తిరస్కరించారనే ప్రచారం ఉంది. - సుచిత్రాసేన్ ఏకైక కుమార్తె మూన్‌మూన్‌సేన్, మనుమరాళ్లు రియాసేన్, రైమాసేన్లు కూడా సినీ తారలే. - సుచిత్రాసేన్ మరణ వార్త వినగానే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఆస్పత్రి వద్దకు వచ్చి ఆమె మృతదేహం వద్ద నివాళులర్పించారు. - సుచిత్రాసేన్ వెండితెరపై పాత్రలకు ప్రాణం పోశారని.. ఆమె మరణంతో సినీ రంగం ఒక గొప్ప నటిని కోల్పోయిందని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ.. మూన్మూన్సేన్కు పంపిన ఒక సంతాపం సందేశంలో నివాళులర్పించారు. -
ప్రముఖ నటి సుచిత్రా సేన్ కన్నుమూత
-
ప్రముఖ నటి సుచిత్రా సేన్ కన్నుమూత
కోల్‌కతా : ప్రఖ్యాత బెంగాలీ నటి మూన్ మూన్ సేన్ తల్లి సుచిత్రా సేన్ (82) శుక్రవారం కన్నుమూశారు. ఆమె గత కొంతకాలంగా తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధి (క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిజార్డర్)తో బాధపడుతున్నారు. గత ఏడాది డిసెంబర్ 23 నుంచి సేన్ కోల్‌కతాలోని బెల్లే వ్యూ హాస్పిటల్లో ఆమె చికిత్స పొందుతున్నారు. ఈ నెల 3వ తేదీన సుచిత్రా సేన్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో క్రిటికల్ కేర్ యూనిట్(సీసీయూ)లో వైద్యులు చికిత్స అందించారు. అప్పటి నుంచి సేన్ వెంటిలేటర్ సహాయంతో శ్వాస తీసుకుంటున్నారు. కుమార్తె మూన్‌మూన్ సేన్, మనవరాళ్లు రియా, రైమా ఆస్పత్రిలో ఉంటూ ఆమెను చూసుకుంటున్నారు. 1952లో ‘శేష్ కొతాయ్’తో నట జీవితాన్ని ప్రారంభించిన సుచిత్రా సేన్ 2005లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. అందచందాలతో అద్భుతమైన నటనతో ఒకప్పుడు బెంగాలీ చిత్రసీమను ఏలిన సుచిత్రా సేన్ 1972లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. 1970లో నటనకు గుడ్‌బై చెప్పిన సుచిత్రా సేన్ అప్పటినుంచి...అభిమానులకు దూరంగా వుంటున్నారు. బొంబయి కా బాబు, మమతా, దేవదాస్, ఆంధీలాంటి హిందీ చిత్రాలతోపాటు దేవదాసు బెంగాలీ చిత్రంలో ఆమె నటనకు అప్పట్లో అభిమానులు జేజేలు పలికారు. 1978 లో ఆమె ప్రణయ్ బాషా అనే బెంగాలీ చిత్రంలో చివరిసారిగా నటించారు. దేవదాసు చిత్రంలో నటనకుగానూ ఆమో ఉత్తమనటి అవార్డు అందుకున్నారు. హిందీలో ఆమె ఇందిరాగాంధీ జీవిత కథను పోలిన ‘ఆంధీ’ అనే చిత్రంలో నటించారు. అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో అవార్డు పొందిన తొలి బెంగాలీ నటి కూడా ఆమె. సప్తపది అనే చిత్రానికి గాను మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉత్తమ నటి అవార్డు లభించింది. కోల్‌కతా ప్రభుత్వం ఆమెను ‘వంగ విభేషణ్’ అవార్డుతో సత్కరించింది. -
సుచిత్రా సేన్ ఆరోగ్యం విషమం
కోల్‌కతా: అలనాటి ప్రముఖ నటి సుచిత్రా సేన్(82) ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. శనివారం ఆమె తీవ్ర శ్వాస సమస్య ఎదుర్కొన్నారు. దీంతో వైద్యులు ట్యూబు ద్వారా ఊపరితిత్తుల్లోని ద్రవాలను బయటకు తీసి, ఆక్సిజన్ అందించారు. ఆమె శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని చికిత్స అందిస్తున్న ఇక్కడి బెలే వ్యూ క్లినిక్ ఆస్పత్రి వైద్యులు చెప్పారు. -
హృదయగత ప్రపంచం
సుచిత్ర సన్నటి, కొంటె నవ్వుకు మించి కాల్పనిక ప్రపంచాన్ని భగ్గున వెలిగించేయగలిగేది మరేదీ ఉండేదీ కాదు. సుచిత్ర విజయవంతమైన హిందీ సినిమాల్లో ఆమె సహ తార కాదు, ఏకైక తార. ఆమె అద్భుత నటనను కనబరిచిన మమత చూసి ఉండకపోతే వెంటనే ఒక కాపీ అర్డర్ ఇవ్వండి. 1960లలో ఉద్యోగమనేది కనుచూపు మేరలో కనబడేది కాదు. ఆ దశాబ్దం తిరుగుబాటుకు, హింసకు సంకేతం కావడంలో ఆశ్చర్యం లేదు. కొందరిది మావోయిస్టు ఉద్యమం కాగా, మిగతావారివి జాతి లేదా మత పరమైన కారణాలు. ఆ పరిస్థితుల్లో సుచిత్రాసేన్ సహవాసం అత్యంత సౌఖ్యవంతమైనదిగా ఉండేది. గతాన్ని తలబోస్తూ గడిపేవారికి జ్ఞాపకాల కలబోత ఏమంత మంచి వార్త కాదు. వయసు విషాద గీతిక ఉపరితలానికి దిగువన ఉండే పొరలాగా కనబడకుండా దాక్కోవాలని ఎంత గట్టిగా ప్రయత్నించినా విఫలవుతుంటుంది. వర్తమానం భవిత దిశగా ఎప్పటిలాగే పరుగులు తీస్తూ పోతుంటే గతానికి ఉండే ఆకర్షణ విముక్తం కాని ఆత్మలను ఆచరణాత్మక ప్రయోజనమేమీ లేని ఆలోచనల్లో మునిగిపోయేలా చేస్తుం ది. అలా అని జ్ఞాపకాల కలబోతంటే అంతానికి సంబంధించిన విచారమేమీ కాదు. అది ఒక అన్వేషణ. బహుశా విషాదకరమైన అన్వేషణ. కాలం చెత్త కుప్పలో బంగారం ఇటుకలను వెతుక్కునే అన్వేషణ. కోల్‌కతాలోని ఓ ఆసుపత్రిలో సుచిత్రాసేన్ తన జీవితం చివ రి రోజులను గడుపుతుండటం ఇక ఎంత మాత్రమూ వార్త కాదు. 1950లు, 1960లలో సమ్మోహన మూర్తి సుచిత్రాసేన్ గురించి తప్ప... ప్రత్యేకించి ఆమె తన ప్రియుడు, నట జీవిత భాగస్వామి ఉత్తమ్‌కుమార్‌తో కలిసి వెండితెరపై కనిపించడం గురించి తప్ప... బెంగాల్‌కు సంబంధించిన మరే వార్తా పట్టించుకోదగినది కాదనిపిస్తుండేది. సుచిత్ర ఎవరికీ తెలియని వారినెవరినో పెళ్లి చేసుకుంది. అతగాడినెవరూ పట్టించుకోలేదు. సుచిత్ర, ఉత్తమ్‌ల మధ్య రసాయనిక శాస్త్రానికి అందని రసాయనిక బంధం ఏదో ఉండేది. దాని ముందు వివాహం అర్థరహితమైనదని అనిపించేది. ఈనాటికి భిన్నంగా అప్పట్లో... నేడు బలహీనపడుతున్న శ క్తులైన తల్లిదండ్రులే అందరి పెళ్లిళ్లు చేసేవారు. అయినాగానీ ఎందరు కళ్లు మిరుమిట్లు గొలిపే అందగత్తెలు, అందగాళ్లు ప్రమాదకరమైన, పాపిష్టి ప్రేమలో పడలేదు? హృదయం ఇరుసు మీదే ప్రపంచం అల్లుకుంది. మీసం మొలవక ముందు తొలిసారిగా నేను వారిద్దరినీ జ్యోతి సినిమా థియేటర్ వెండితెరపై చూశాను. నల్లులను మంచం పురుగులని తప్పుగా పిలుస్తున్నారనే నా అభిప్రాయం సరైనదేనని ఆ హాల్లో రుజువైంది. మంచానికి వెలుపల కూడా నల్లులకు చాలా జీవితం ఉంది. అప్పట్లో మేం ఒంపులు తిరుగుతూ పోయే హుగ్లీ నదికి అభిముఖంగా, నది ఒడ్డునే ఉన్న ఒక జనపనార మిల్లుకు శివారు గ్రామంలో ఉండేవాళ్లం. ఊహాగానం సదా సరిహద్దుల బంధనాలకు అతీతంగా ఒకదానితో ఒకటి కలగలిసిపోయిన కలల కలగూర గంపలోకి జారిపోతూ ఉంటుంది. సుచిత్ర సన్నటి, కొంటె నవ్వుకు మించి కాల్పనిక ప్రపంచాన్ని భగ్గున వెలిగించేయగలిగేది మరేదీ ఉండేదీ కాదు. ఉత్తమ్‌కుమార్ సంతోషంగా ఆ దేవత ముందు పెద్ద పిల్లాడైపోయేవాడు. ఆ సినిమా పేరేమిటో గుర్తుకు రావడం లేదు. బహుశా సప్తపది కావొచ్చు, కాకపోవచ్చు. ఆధునిక ఇంటర్నెట్ వినువీధుల్లో ఆ పేరును అతి సునాయసంగా తెలుసుకోవచ్చు. అది తెలుపు-నలుపు సినిమాల కాలం. ముకమల్ శకం. ముకమల్ మెరుపు దానికదే ఒక ప్రత్యేకమైన రంగులా కనిపించేది. జ్ఞాపకం వ్యక్తిగతమైనదిగా కంటే వ్యాప్తి చెందినప్పుడే ఎక్కువ ఉపయోగపడుతుంది. 1960ల కాలం ముళ్ల గొంగళిని కప్పుకుని ఉండేది. ఉద్యోగం కనుచూపు మేరలో కనబడేది కాదు, అవకాశాలు ఉండేవి కావు. ఆకాంక్షలకులాగే ఆర్థికవ్యవస్థకు కూడా ఆదరణ కరువై ఉండేది. ఆ దశాబ్దం తిరుగుబాటుకు, హింసకు సంకేతం కావడంలో ఆశ్చర్యం లేదు. కొందరిది మావోయిస్టు ఉద్యమం కాగా, మిగతా వారివి జాతి లేదా మతపరమైన కారణాలు. ఆ పరిస్థితుల్లో సుచిత్రాసేన్ సహవాసం అత్యంత సౌఖ్యవంతమైనదిగా ఉండేది. ఏ మాటకా మాటే చెప్పుకోవాలి... ఉత్తమ్‌కుమార్ సాంగత్యం కూడా అలాంటిదే. నిజమే, అలాంటి కులాసా కాలాక్షేపం అదొక్కటే కాదు. దేవానంద్ కూడా తోడు ఉండేవాడు. అతి చురుకైన సామాన్యునిగా దేవానంద్ చిల్లర మల్లర నేరాల దారుల్లో అడ్డదిడ్డంగా సంచరించడమే (బ్లాక్ మార్కెట్లో టిక్కెట్లమ్మడం, జేబులు కత్తిరించడం, జూదగృహంలో ధైర్యాన్ని ప్రద ర్శించడం) అతని మనుగడకు ఏకైక ఆధారం. అది కూడా సుచిత్ర అంతగానూ ఆకట్టుకునేది. దేవానంద్, సుచిత్ర కలిసి నటించిన సినిమా బొంబయ్ కా బాబు ఒక్కటే. అందులో వారిద్దరూ ఒకరికొకరు అంత దూరంగా ఎందుకున్నారో నా కెప్పుడూ అర్థం కాలేదు. ఆ చిత్ర నిర్మాణమంతా లోపరహితంగానే జరిగింది. హీరో, హీరోయిన్లు ఇద్దరూ తారస్థాయిలోనే న టించారు. సంగీతం దివ్యం. ఇక కథ... అవలింతలు తెప్పించే అర్థరాహిత్యానికి భిన్నమైనది. సుచిత్ర, దేవానంద్‌ల మధ్య వ్యక్తిగతంగా ఎలాంటి సమస్యా లేదు. అయినా వారిద్దరూ ఉదాసీనంగా కనిపించారు. బెంగాలీ సినిమా గురించి తెలిసిన మాలాంటి వారికి అది ఉపశమనాన్ని కలిగించింది. ఉంటే సుచిత్ర, ఉత్తమ్ ఉండాలి లేదా సుచిత్ర ఒక్కరే ఉంటారు లేదా ఎవరూ ఉండరు. సుచిత్ర, ఉత్తమ్‌లు బెంగాలీ ఒథెల్లోలో నటించారు. సుచిత్ర హిందీ సినిమాకు అలవాటు పడలేకపోయారు. అలాగే ఉత్తమ్‌కుమార్ కూడానూ. ఉత్తమ్ స్థానంలో మరొకరు అవసరం కానప్పుడే సుచిత్ర హిందీ సినిమాల్లో విజయవంతమయ్యారు. అలాంటి సినిమాల్లో ఆమె సహ తార కాదు, ఏకైక తార. ఆమె అద్భుత నటనను కనబరిచిన మమత మీరు చూసి ఉండకపోతే వెంటనే ఒక కాపీ అర్డర్ ఇవ్వండి. అది భగ్న ప్రేమ, వంచిత జీవితం సినిమా. అందులో లతా మంగేష్కర్ పాడిన రహతే థే కభీ జిన్కే దిల్ మే హమ్ జాన్ సే బీ ప్యారో కీ తరా / బైతే హై ఉన్హీ కే మెహ్ఫిల్ మై హమ్ ఆజ్ గునాగారోంకి తరా, హేమంత్‌కుమార్ అజరామార గీతం చుపాలో యే దిల్ మే ప్యార్ మెరా అనే రెండు పాటలూ క్లాసిక్స్. హిందీలో సుచిత్ర రెండో విజయవంతమైన సినిమా ఆంథీ. ఆ సినిమాలో సుచిత్ర ఇందిరాగాంధీ లాంటి రాజకీయవేత్త పాత్రను పోషించింది. సుచిత్ర బెంగాలుకు చె ందినది, బెంగాలీయే. ఉత్తమ్‌కుమార్ హఠాత్తుగా మరణించి మూడు దశాబ్దాలకు పైగానే అయింది. అప్పుడు నేను సండే వార్తా వారపత్రికకు సంపాదకుణ్ణి. ఉత్తమ్ సంస్మరణ సంచిక... ఒక్క కలకత్తాలోనే కాదు ప్రతి చోటా దుకాణాలకు చేరిన మరుక్షణమే అమ్ముడై పోయింది. ఉత్తమ్ అమితంగా ప్రేమించిన కలకత్తా నగర వీధుల గుండా అతడు అంతిమ యాత్ర సాగిస్తుండగా... యువ అభిమానులు తమ ఆరాధ్య నటుడ్ని తాకాలని ఉన్మాదంతో కుమ్ములాడారు. అప్పుడు సుచిత్ర మనతోనే ఉన్నారు. అనివార్యమైనదాన్ని విధి అతి ఉదారంగా వీలయినంత ఎక్కువ అలస్యం చేస్తుందని ఆశిద్దాం. ఆమె పట్ల ఆరాధనాభావం సజీవంగా ఉన్నంత కాలం ఆమె జ్ఞాపకానికి మరణం లేదు. - ఎం.జె.అక్బర్ సీనియర్ సంపాదకులు -
ప్రముఖ నటి సుచిత్రా సేన్ ఆరోగ్యం విషమం!
ప్రముఖ నటి, మూన్ మూన్ సేన్ తల్లి సుచిత్రా సేన్ ఆరోగ్య పరిస్థితి శుక్రవారం విషమించడంతో క్రిటికల్ కేర్ యూనిట్(సీసీయూ)లో చికిత్సనందిస్తున్నామని వైద్యులు వెల్లడించారు. సేన్ కు వెంటిలేటర్ సహాయంతో శ్వాస అందిస్తున్నామన్నారు. సేన్ ఆరోగ్యం ఆందోళనకరంగా మారడంతో మూన్ మూన్ సేన్ సూచనతో వెంటిలేటర్ పై ఉంచామని కోల్ కతాలోని బెల్లే వ్యూ క్లినిక్ వైద్యులు తెలిపారు. చాతి సంబంధిత వ్యాదితో బాధపడుతున్న సుచిత్రా సేన్ డిసెంబర్ 23 తేదిన ఆస్పత్రిలో చేరారు. హార్ట్ బీట్ తగ్గిపోవడంతో ఆదివారం రాత్రి ఆమెను సీసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నారు.