
సుచిత్రా సేన్ ఆరోగ్యం విషమం
కోల్‌కతా: అలనాటి ప్రముఖ నటి సుచిత్రా సేన్(82) ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. శనివారం ఆమె తీవ్ర శ్వాస సమస్య ఎదుర్కొన్నారు. దీంతో వైద్యులు ట్యూబు ద్వారా ఊపరితిత్తుల్లోని ద్రవాలను బయటకు తీసి, ఆక్సిజన్ అందించారు. ఆమె శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని చికిత్స అందిస్తున్న ఇక్కడి బెలే వ్యూ క్లినిక్ ఆస్పత్రి వైద్యులు చెప్పారు.