ప్రముఖ నటి, మూన్ మూన్ సేన్ తల్లి సుచిత్రా సేన్ ఆరోగ్య పరిస్థితి శుక్రవారం విషమించడంతో క్రిటికల్ కేర్ యూనిట్(సీసీయూ)లో చికిత్సనందిస్తున్నామని వైద్యులు వెల్లడించారు.
ప్రముఖ నటి సుచిత్రా సేన్ ఆరోగ్యం విషమం!
Published Fri, Jan 3 2014 8:13 PM | Last Updated on Sat, Sep 2 2017 2:15 AM
ప్రముఖ నటి, మూన్ మూన్ సేన్ తల్లి సుచిత్రా సేన్ ఆరోగ్య పరిస్థితి శుక్రవారం విషమించడంతో క్రిటికల్ కేర్ యూనిట్(సీసీయూ)లో చికిత్సనందిస్తున్నామని వైద్యులు వెల్లడించారు. సేన్ కు వెంటిలేటర్ సహాయంతో శ్వాస అందిస్తున్నామన్నారు. సేన్ ఆరోగ్యం ఆందోళనకరంగా మారడంతో మూన్ మూన్ సేన్ సూచనతో వెంటిలేటర్ పై ఉంచామని కోల్ కతాలోని బెల్లే వ్యూ క్లినిక్ వైద్యులు తెలిపారు. చాతి సంబంధిత వ్యాదితో బాధపడుతున్న సుచిత్రా సేన్ డిసెంబర్ 23 తేదిన ఆస్పత్రిలో చేరారు. హార్ట్ బీట్ తగ్గిపోవడంతో ఆదివారం రాత్రి ఆమెను సీసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Advertisement
Advertisement