Riya Sen
-
హీరోయిన్గా తెలుగులో ఒక్కటే సినిమా.. ఈ బ్యూటీని గుర్తుపట్టారా?
హీరోయిన్లకు వయసు పెరిగితే గ్లామర్ తగ్గిపోతుందని అంటారు. అదేంటో గానీ ఈ బ్యూటీ 40 ఏళ్లు క్రాస్ చేసినా సరే ఇప్పటికీ అందంగానే కనబడుతోంది. కుర్ర హీరోయిన్లకు పోటీ ఇచ్చేలా కనిపిస్తుంది. తెలుగుతో కలిసి మొత్తంగా ఏడు భాషల్లో సినిమాలు చేసింది. అలానే ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గానే ఉండిపోయింది. మరి ఈమె ఎవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా? పైన ఫొటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మ పేరు రియాసేన్. స్వతహాగా బెంగాలీ అయినా ఈమె.. అమ్మ, అమ్మమ్మ కూడా హీరోయిన్లే. అంతెందుకు ఈమె అక్క కూడా హీరోయినే. తెలుగులో 'ధైర్యం'లో చేసిన రైమా సేన్ ఈమెకు సొంత అక్క. వీళ్లందరి వారసత్వాన్ని కొనసాగిస్తూ రియా సేన్.. ఐదేళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చేసింది. 10 ఏళ్ల వయసు నుంచి పూర్తి స్థాయి నటిగా మారిపోయింది. (ఇదీ చదవండి: చెప్పిన టైమ్ కంటే ముందే ఓటీటీలోకి వచ్చేసిన చైతూ ఫస్ట్ వెబ్ సిరీస్) 18 ఏళ్ల టీనేజ్ వయసులో ఉండగానే 'తాజ్‌మహల్' అనే తమిళ సినిమాతో హీరోయిన్ అయ్యింది. అనంతరం బెంగాలీ, హిందీ, మలయాళ, ఇంగ్లీష్, ఒడియా భాషల్లో హీరోయిన్గా పలు చిత్రాలు చేసింది. 2008లో రిలీజైన 'నేను మీకు తెలుసా?' అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది ఈ బ్యూటీనే. కాకపోతే ఇది ఫ్లాప్ అయ్యేసరికి తెలుగులో మరో ఛాన్స్ రాలేదు. దీంతో మిగతా భాషలకే పరిమితమైపోయింది. గత రెండు మూడేళ్ల నుంచి ఈమెకు అటు సినిమాల్లో గానీ ఇటు వెబ్ సిరీస్‌ల్లో గానీ ఛాన్సులు రావడం లేదు. దీంతో ఇన్ స్టాలో గ్లామరస్ ఫొటోలు పోస్ట్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తోంది. ఈమె వయసు ఇప్పుడు 42 ఏళ్లు. అయినా సరే అస్సలు అలా కనిపించదు. అక్క రైమాసేన్లానే ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండానే ఉండిపోయింది. సో అదన్నమాట విషయం. (ఇదీ చదవండి: తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేయని ప్రభాస్.. కారణం అదేనా?) View this post on Instagram A post shared by ✯ riya sen ✯ (@riyasendv) View this post on Instagram A post shared by ✯ riya sen ✯ (@riyasendv) -
రాహుల్ పాదయాత్రలో మెరిసిన హీరోయిన్.. ఫోటోలు, వీడియోలు వైరల్
ముంబై: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర గురువారంతో 71వ రోజుకి చేరింది. ప్రస్తుతం ఆయన మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు. రాహుల్ ఏ రాష్ట్రంలో అడుగుపెడితే అక్కడి ప్రముఖులు, కాంగ్రెస్ నాయకులు, నటీనటులు సైతం యాత్రలో పాల్లొంటున్నారు. జోడో యాత్ర అకోలా నగరంలో కొనసాగుతున్న సందర్భంగా బాలీవుడ్ నటి రియా సేన్ రాహుల్ గాంధీతో జాయిన్ అయ్యారు. రాహుల్‌తో కలిసి ఆమె కొద్ది దూరం నడిచారు.రాహుల్, రియా సేన్ కలిసి నడుస్తున్న ఫోటోలు, వీడియోలను కాంగ్రెస్ అధికారిక ట్విటర్లో పోస్టు చేసింది. ఇవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అటు రియా సైతం రాహుల్‌ని కలిసిన అనుభవాన్ని ట్విటర్లో షేర్ చేశారు. సినీ నటిగా మాత్రమే కాకుండా గర్వించదగిన పౌరుడిగా ఈ యాత్రలో భాగమైనందుకు సంతోషంగా ఉందంటూ హర్షం వ్యక్తం చేశారు. #BharatJodoYatra में शामिल हुई अभिनेत्री रिया सेन। अब सड़कें इंक़लाब की गवाह बन रही है। pic.twitter.com/U1PJ3ouRh4 — Congress (@INCIndia) November 17, 2022 కాగా రియా.. ఝంకార్ బీట్స్, నౌకదుబి వంటి సినిమాలతో పాపులారిటీ సాధించారు. ఇంతకుముందు నటి పూజాభట్ రాహుల్ గాంధీకి తన మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆమె హైదరాబాద్‌లో జోడో యాత్ర కొనసాగిన క్రమంలో రాహుల్‌తో కలిసి నడిచారు. ఇక సెప్టెంబర్ 7న బారత్ జోడో యాత్ర పేరుతో కన్యకుమారి నుంచి రాహుల్ ప్రారంభమైన విషయం తెలిసిందే. నవంబర్ 9న నందేడ్ జిల్లా ద్వారా మహారాష్ట్రలోకి ప్రవేశించింది. लोग जुड़ रहे हैं...डर मिट रहा है...नया सूरज उगने ही वाला है। आज #BharatJodoYatra में अभिनेत्री रिया सेन शामिल हुईं। pic.twitter.com/1XSFtXBAQj — Congress (@INCIndia) November 17, 2022 -
రహస్య వివాహం చేసుకున్న హీరోయిన్!
సాక్షి, న్యూఢిల్లీ: సినిమా హీరోయిన్లు ఎప్పుడు తమను తాము ప్రచారం చేసుకోవడానికి ట్విట్టర్లు, ఫేస్‌బుక్‌లు దాటి ఇన్‌స్టాగ్రామ్‌ను వాడుకుంటున్నారు. తమ గ్లామర్ ఫోటోలను అందులో పోస్ట్ చేసి అభిమానులను ఆకట్టుకుంటారు. నటి రియాసేన్ గుర్తుందా? ఈ బాలీవుడ్ బ్యూటీ తన ఫొటోల ద్వారా ప్రైవేట్ విమానయాన సంస్థ అధినేత శివం తివారిని ఆకర్శించింది. రియాసేన్ ఫొటోలు చూసి ఆమెకు వీరాభిమాని అయిపోయాడు. అంతేకాదు ఆమెకు ఫోన్ చేసి పరిచయం పెంచుకున్నాడు. మామూలుగా మొదలయిన వీరి పరిచయం ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి వరకూ చేరింది. వీరి పెళ్లి ఈ నెల చివరి వారంలో జరగనుందని వార్తలు వచ్చాయి. అయితే బాలీవుడ్ సమాచారం ప్రకారం రియాసేన్, శివం తివారీ పెళ్లి ఎప్పుడో జరిగిపోయిందట. సన్నిహితులు, బంధువుల సమక్షంలో వాళ్లిద్దరూ పూణేలో పెళ్లి చేసుకున్నారంటూ రియా సోదరి రైమా సేన్ సోషల్‌మీడియాలో ఫొటోలను షేర్ చేసింది. ఇందులో రియా సేన్, శివం తివారీలు సంప్రదాయ బెంగాళీ పెళ్లి దుస్తుల్లో చూడముచ్చటగా ఉన్నారు. ఈ పెళ్లికి పరిమిత సంఖ్యలో స్నేహితులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. అయితే ఈ పెళ్లి గురించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. రియాసేన్ ఏక్తాకపూర్ వెబ్ సిరీస్ రాగిణి ఎమ్ఎమ్ఎస్2.2లో నటించింది. ఇది రియాసేన్ అభిమానులను చేదు వార్తే. -
ప్రముఖ నటి సుచిత్రా సేన్ కన్నుమూత
-
ప్రముఖ నటి సుచిత్రా సేన్ కన్నుమూత
కోల్‌కతా : ప్రఖ్యాత బెంగాలీ నటి మూన్ మూన్ సేన్ తల్లి సుచిత్రా సేన్ (82) శుక్రవారం కన్నుమూశారు. ఆమె గత కొంతకాలంగా తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధి (క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిజార్డర్)తో బాధపడుతున్నారు. గత ఏడాది డిసెంబర్ 23 నుంచి సేన్ కోల్‌కతాలోని బెల్లే వ్యూ హాస్పిటల్లో ఆమె చికిత్స పొందుతున్నారు. ఈ నెల 3వ తేదీన సుచిత్రా సేన్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో క్రిటికల్ కేర్ యూనిట్(సీసీయూ)లో వైద్యులు చికిత్స అందించారు. అప్పటి నుంచి సేన్ వెంటిలేటర్ సహాయంతో శ్వాస తీసుకుంటున్నారు. కుమార్తె మూన్‌మూన్ సేన్, మనవరాళ్లు రియా, రైమా ఆస్పత్రిలో ఉంటూ ఆమెను చూసుకుంటున్నారు. 1952లో ‘శేష్ కొతాయ్’తో నట జీవితాన్ని ప్రారంభించిన సుచిత్రా సేన్ 2005లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. అందచందాలతో అద్భుతమైన నటనతో ఒకప్పుడు బెంగాలీ చిత్రసీమను ఏలిన సుచిత్రా సేన్ 1972లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. 1970లో నటనకు గుడ్‌బై చెప్పిన సుచిత్రా సేన్ అప్పటినుంచి...అభిమానులకు దూరంగా వుంటున్నారు. బొంబయి కా బాబు, మమతా, దేవదాస్, ఆంధీలాంటి హిందీ చిత్రాలతోపాటు దేవదాసు బెంగాలీ చిత్రంలో ఆమె నటనకు అప్పట్లో అభిమానులు జేజేలు పలికారు. 1978 లో ఆమె ప్రణయ్ బాషా అనే బెంగాలీ చిత్రంలో చివరిసారిగా నటించారు. దేవదాసు చిత్రంలో నటనకుగానూ ఆమో ఉత్తమనటి అవార్డు అందుకున్నారు. హిందీలో ఆమె ఇందిరాగాంధీ జీవిత కథను పోలిన ‘ఆంధీ’ అనే చిత్రంలో నటించారు. అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో అవార్డు పొందిన తొలి బెంగాలీ నటి కూడా ఆమె. సప్తపది అనే చిత్రానికి గాను మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉత్తమ నటి అవార్డు లభించింది. కోల్‌కతా ప్రభుత్వం ఆమెను ‘వంగ విభేషణ్’ అవార్డుతో సత్కరించింది. -
ప్రముఖ నటి సుచిత్రా సేన్ ఆరోగ్యం విషమం!
ప్రముఖ నటి, మూన్ మూన్ సేన్ తల్లి సుచిత్రా సేన్ ఆరోగ్య పరిస్థితి శుక్రవారం విషమించడంతో క్రిటికల్ కేర్ యూనిట్(సీసీయూ)లో చికిత్సనందిస్తున్నామని వైద్యులు వెల్లడించారు. సేన్ కు వెంటిలేటర్ సహాయంతో శ్వాస అందిస్తున్నామన్నారు. సేన్ ఆరోగ్యం ఆందోళనకరంగా మారడంతో మూన్ మూన్ సేన్ సూచనతో వెంటిలేటర్ పై ఉంచామని కోల్ కతాలోని బెల్లే వ్యూ క్లినిక్ వైద్యులు తెలిపారు. చాతి సంబంధిత వ్యాదితో బాధపడుతున్న సుచిత్రా సేన్ డిసెంబర్ 23 తేదిన ఆస్పత్రిలో చేరారు. హార్ట్ బీట్ తగ్గిపోవడంతో ఆదివారం రాత్రి ఆమెను సీసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నారు.