దేవదాసుకు 13 ఏళ్లు | 13 years of 'Devdas': SRK thanks team, makes Dubsmash video | Sakshi
Sakshi News home page

దేవదాసుకు 13 ఏళ్లు

Published Sun, Jul 12 2015 5:34 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

దేవదాసుకు 13 ఏళ్లు - Sakshi

దేవదాసుకు 13 ఏళ్లు

ముంబయి: బాలీవుడ్ సంచలన విజయం సాధించిన దేవదాసు చిత్రానికి నేటికి సరిగ్గా 13 సంవత్సరాలు. ఈ సందర్భంగా బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ ఆ చిత్ర యూనిట్ మొత్తానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ చిత్రం విడుదలై 13 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దానికి సంబంధించి ఓ వీడియోను రూపొందించి పంచుకున్నారు.

ఆ వీడియోలో దేవదాసు చిత్రంలోని ఓ డైలాగ్ను చేతిలో క్యాండిల్ పట్టుకుని ఫీలవుతూ చెప్పారు. దేవదాసు చిత్రం రావడానికి కారణమైన నవల దేవదాసు రచయిత శరత్ చంద్ర ఛటోపాధ్యాయను స్మరించారు. ఈ చిత్రానికి సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వం వహించగా పార్వతీగా ఐశ్వర్యరాయ్, చంద్రముఖిగా మాధురి దీక్షిత్ నటించారు. 2002లో విడుదలైన ఈ చిత్రంలో జాకీ ష్రాప్, కిరణ్ ఖేర్, స్మతా జయకర్ కూడా ప్రముఖ పాత్రలు పోషించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement