‘‘దేవదాస్’ సినిమా పూర్తయ్యింది. నేను హోస్ట్ చేస్తున్న ‘బిగ్ బాస్ 2’ షో పూర్తి కావొచ్చింది. ఈ రెండు విషయాల్లోనూ ‘హమ్మయ్య’ అని ఫీల్ అవుతున్నా. ఎందుకంటే... ఫస్ట్ టైమ్ నాలుగు నెలలుగా నా కెరీర్‌లో ఒక హాఫ్ డే కూడా బ్రేక్ లేదు. రెండు గంటలు నా కొడుకుతో గడిపే సమయమూ లేదు. ‘బిగ్ బాస్’ షో నా లైఫ్‌లో మార్పు తీసుకొచ్చింది. నా మూడున్నర నెలల ఒత్తిడికి ఈ వీకెండ్‌లో శుభం కార్డు పడుతుంది. నెక్ట్స్ హాలీడేకి వెళ్దాం అనుకుంటున్నా’’ అన్నారు నాని. నాగార్జున, నాని హీరోలుగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో అశ్వనీదత్ నిర్మించిన ‘దేవదాస్’ చిత్రం ఈ రోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నాని చెప్పిన సంగతులు...
► ‘దేవదాస్’ సినిమాలో డాక్టర్ దాసు పాత్ర చేశా. నాగ్ సార్, నాకు సింక్ బాగా కుదరడంతో అశ్వనీదత్‌గారు ‘గుండమ్మ కథ’తో పోల్చారు. రాజ్‌కుమార్ హిరానీ సినిమా స్టైల్‌లో ఉంటుందని నాగార్జునగారు అన్నారు. కథలో ఉన్న పరిస్థితులు నవ్విస్తాయి కానీ డైలాగ్స్ కాదు. నా దృష్టిలో ఫన్, ఎమోషన్స్.. ఇలా అన్నీ ఉన్న కంప్లీట్ ప్యాకేజ్ మూవీ ఇది.
► ‘దేవదాస్’ సినిమా లైన్‌పై మాకు తొలుత 20 శాతం ఐడియా మాత్రమే ఉంది. దీన్ని 100 పర్సెంట్‌గా ఎవరు చేస్తారని కొందరి దర్శకుల పేర్లు అనుకున్నాం. ఒకానొక టైమ్‌లో నాగ్ సర్, నేను కుదిరినప్పుడు చేద్దాం అని వదిలేశాం. ఓసారి శ్రీరామ్‌ను పిలిపించి ఈ 20 పర్సెంట్ ఐడియాను డెవలప్ చెయ్యి.. నాకు, నాగ్ సార్‌కి నచ్చితే చేద్దాం. కుదరకపోతే నీ కష్టం వేస్ట్ అన్నాను. నేను వరంగల్‌లో ‘ఎమ్‌సీఏ’ సినిమా చేస్తున్నప్పుడు పూర్తి కథ చెప్పాడు.
► ‘దేవదాస్’ కథ విన్న వెంటనే నేను స్వప్నాదత్‌కి కాల్ చేశా. కానీ నాకు అప్పటికే కొన్ని సినిమాల కమిట్‌మెంట్స్ ఉన్నాయి. అయితే శ్రీరామ్ కష్టం చూసిన తర్వాత నమ్మకం కుదరింది. నో చెప్పాలనిపించలేదు. అప్పుడు నాగ్ సార్‌కి కథ చెప్పడం.. ఆయనకు నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ కుదిరింది.
► నాగార్జునగారితో నేను మాట్లాడగలుగుతానా? అని మొదట్లో అనుకున్నాను. కానీ, ఫస్ట్ డే లంచ్ సమయానికే మా ఇద్దరికీ సింక్ కుదిరింది. నా ఏజ్ యాక్టర్‌తో కలిసి నటిస్తున్నానన్న ఫీలింగ్ వచ్చింది.
► నాగార్జునగారు, బాలకృష్ణగారు, చిరంజీవిగారు, వెంకటేష్‌గారు.. కాకుండా మిగిలిన హీరోలందరూ నా క్లాస్‌మేట్స్ అనే ఫీలింగ్ ఉంటుంది. కాకపోతే కొందరు ముందు బెంచ్ అయ్యుండొచ్చు. నేను బ్యాక్ బెంచ్ అయ్యుండొచ్చు. కానీ, అందరూ ఒకే క్లాస్‌లో ఉంటాం కదా!. కానీ వాళ్లు నలుగురూ ప్రత్యేకమే. ఎందుకంటే వాళ్ల సినిమాలు చూస్తూ పెరిగాను.
► రెండేళ్ల క్రితం ఐఫా అవార్డ్స్‌కి నాగ్ సార్, అమలగారు వచ్చారు. నాకు చాలా ఇష్టమైన యాక్టర్ నాని అని నాగార్జునగారు చెప్పారు. అప్పుడు అమలగారు నాగార్జునగారిని క్రాస్ చేసి ముందుకు వచ్చి నాని.. తెలుగు చాలా బాగా మాట్లాడతాడు. వెరీ స్వీట్ అని చెప్పారు. ఆ వీడియో క్లిప్పింగ్‌ని చూసి బాగా మురిసిపోయా. మా ఫ్యామిలీ మెంబర్స్‌కి చూపించాను.
► ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమా కష్టపడి చేశా. ఆడియన్స్‌కు నచ్చలేదు. స్క్రిప్ట్ పరంగా ఇంకాస్త వర్కౌట్ చేయాల్సిందని నేను, డైరెక్టర్ మేర్లపాక గాంధీ అనుకున్నాం. ఒక రకంగా దిష్టి పోయిందనుకున్నా. చేసే ప్రతి సినిమా హిట్ కావాలని ఏం లేదుగా. ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. నేను ఇమేజ్ డ్రివెన్ యాక్టర్‌ని కాదు. నా సినిమా చూసి ఎంజాయ్ చేయాలని, ప్రేక్షకులకు మంచి సినిమా ఇవ్వాలనుకుంటాను.
► ‘ఎవడే సుబ్రమణ్యం’ టైమ్‌లో అశ్వనీదత్‌గారు పెద్దగా ఇన్‌వాల్వ్ కాలేదు. ఆ సినిమా చూసి దత్‌గారు అభినందించారు. ఆయనకు సినిమా అంటే చాలా ప్యాషన్. ఖర్చుకు వెనకాడరు. నా సినిమాలు విడుదలైన రోజు ఆయన జెన్యూన్ ఒపీనియన్ చెబుతారు. నన్ను టాప్ హీరోలతో పోల్చి నాలో ఎనర్జీ నింపేవారు. యాక్టర్స్ అందర్నీ ఆయన ఫ్యామిలీ మెంబర్స్‌లా ట్రీట్ చేస్తారు.
► గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో చేయనున్న ‘జెర్సీ’ సినిమాలో కొత్త నానీని చూస్తారు. ఇందులో క్రికెటర్‌గా కనిపిస్తాను. సచిన్ నా ఫేవరెట్ క్రికెటర్. ఇది కాకుండా నాలుగైదు సినిమాల గురించి చర్చలు జరుగుతున్నాయి.
మూడున్నర నెలల ఒత్తిడికి శుభం కార్డ్
Published Thu, Sep 27 2018 12:18 AM | Last Updated on Thu, Jul 18 2019 1:41 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment