వెంకీ మామా ఎప్పుడొస్తావ్‌? | venkatesh, naga chaitanya new movie is venky mama | Sakshi
Sakshi News home page

వెంకీ మామా ఎప్పుడొస్తావ్‌?

Published Tue, Sep 11 2018 12:22 AM | Last Updated on Tue, Sep 11 2018 12:22 AM

venkatesh, naga chaitanya new movie is venky mama - Sakshi

వెంకటేశ్, నాగచైతన్య

మామా అల్లుళ్లు కలిస్తే వాతావరణం అంతా సందడి సందడిగా మారిపోతుంది. అలా నవ్వులు పూయించడానికి అక్టోబర్‌ నుంచి అల్లుడు నాగచైతన్యతో కలిసి రెడీ అవనున్నారు మామ వెంకటేశ్‌. కేయస్‌ రవీందర్‌ (బాబీ) దర్శకత్వంలో వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా ఓ మల్టీస్టారర్‌ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. సురేశ్‌ ప్రొడక్షన్, బ్లూ ప్లానెట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్స్‌ సంయుక్తంగా నిర్మించనున్నాయి.

ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ అక్టోబర్‌ ఫస్ట్‌ వీక్‌లో స్టార్ట్‌ కానుందని సమాచారం. ఈ చిత్రానికి ‘వెంకీ మామ’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారు. సినిమాలోనూ మామా అల్లుడిగా కనిపిస్తారు వెంకీ, చైతన్య. ఈ సినిమాలో వెంకటేశ్‌కి జోడీగా హ్యూమా ఖురేషి, నాగచైతన్యకు జోడీగా రకుల్‌ప్రీత్‌సింగ్‌ నటించనున్నారని సమాచారం. వచ్చే ఏడాది సమ్మర్‌కి ఈ సినిమా విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు చిత్రబృందం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement