
సినీ పరిశ్రమలో గాసిప్‌లకు ఏమాత్రం డోకా ఉండదు. అందునా ప్రముఖుల విషయాలు అంటే మాత్రం ఆ గాసిప్‌లు ఓ రేంజ్‌లో ఉంటాయి. తాజాగా దర్శకధీరుడు రాజమౌళి, టాలీవుడ్ యంగ్‌స్టార్స్ రామ్‌చరణ్, జూ.ఎన్టీఆర్‌లతో ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ చిత్రంపై ఇప్పటికే టాలీవుడ్‌లో భారీ అంచనాలతోపాటు, గాసిప్‌లు సైతం హల్‌చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే దీనికి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఇందులో ప్రధాన పాత్రధారులు రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లు మినహా ఇతర నటుల గురించి వేట ఇప్పటికే మొదలైందని టాలీవుడ్ టాక్. అయితే ఇప్పుడు ఈసినిమా గురించి మరో వార్త టాలీవుడ్‌లో వైరల్ అయింది. చరణ్, తారక్ పాత్రలతో సమానమైన పాత్ర ఒకటి ఉందని దాని కోసం మరో యువ మెగా హీరోను సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతకు ఆపాత్రలో ఎవరు నటిస్తారంటే అల్లు అర్జున్ అని టాలీవుడ్‌లో గుసగుసలు. అయితే ఇది ఎంతవరకు నిజం అనేదాన్ని పక్కన పెడితే బన్నీ అభిమానులు మాత్రం చాలా ఆనందపడుతున్నారు.
అయితే ఈవార్తపై చిత్ర వర్గాల నుంచి ఎటువంటి అధికార ప్రకటనలేదు. ఇందులో ఏమాత్రం నిజముందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాతోను, చరణ్ ‘రంగస్థలం’,, బోయపాటి శ్రీను చిత్రాలతోను బిజీగా ఉన్నారు. అక్టోబర్లో మొదలుకానున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దానయ్య నిర్మిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment