నాగార్జున, కార్తీ చిత్రానికి చెన్నైలో శ్రీకారం | Nagarjuna - Karthi multistarrer movie Started | Sakshi
Sakshi News home page

నాగార్జున, కార్తీ చిత్రానికి చెన్నైలో శ్రీకారం

Published Mon, Mar 16 2015 12:54 AM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

నాగార్జున, కార్తీ చిత్రానికి చెన్నైలో శ్రీకారం - Sakshi

నాగార్జున, కార్తీ చిత్రానికి చెన్నైలో శ్రీకారం

మల్టీస్టారర్ చిత్రాల ట్రెండ్ మొదలైందని చెప్పడం సాధారణ విషయమే. అయితే అలాంటి ఒక భారీ చిత్రంలో తెలుగు స్టార్, తమిళ స్టార్ కలిసి నటించడం విశేషం. అలాంటి క్రేజి కాంబినేషన్ నాగార్జున, కార్తీలతో తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రం. టాలీవుడ్ దర్శకుడు వంశి పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ చిత్రాన్ని పివిపి సినిమా పతాకంపై పొట్లూరి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ కాంబినేషన్‌కు నటి శ్రుతిహాసన్ జోడైతే ఆ క్రేజ్ వేరు. అలాంటి పలు విశేషాలతో కూడిన ఈ చిత్రం ఆదివారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
 
  స్థానిక ఎవిఎం స్టూడియోలో జరిగిన ఈ కార్యక్రమానికి సీనియర్ నటుడు శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్తీ నటి జయసుధ, దర్శకుడు వంవీ పైడిపల్లి పివిపి నిర్వాహకులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో కార్తీ మాట్లాడుతూ ప్రముఖ నటుడు నాగార్జునతో నటించడానికి చాలా ఉత్సాహంతో ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. చిత్ర కథ, తన పాత్ర నచ్చడంతో ఈ చిత్రం చేయడానికి అంగీకరించినట్లు చెప్పారు. దర్శకుడు వంశి పైడిపల్లి మాట్లాడుతూ ఈ కథను నాగార్జునను దృష్టిలో పెట్టుకునే రాసినట్లు చెప్పారు. మరో హీరో పాత్రకు ఎవరిని ఎంపిక చేయాలన్న చర్చ వచ్చినప్పుడు తన ఆలోచనలో కొచ్చిన నటుడు కార్తీ అని పేర్కొన్నారు.
 
 చిత్ర యూనిట్ కూడా ఆయనే కరెక్ట్ అన్న నిర్ణయానికి రావడంతో కార్తీకి కథ చెప్పగా బాగుంది చేద్దాం అని అన్నారన్నారు. సోమవారం నుంచి చెన్నైలో షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు చెప్పారు. తదుపరి 40 రోజుల పాటు విదేశాల్లో చిత్రీకరించి ఆపై హైదరాబాద్‌లో షూటింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కార్తీ సరసన నటి శ్రుతిహాసన్, ఆయన తల్లిగా జయసుధ నటించనున్నారని చెప్పారు. నాగార్జున సరసన నటించే హీరోయిన్ ఎవరన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ అని దర్శకుడు అన్నారు. ఈ చిత్రానికి మళయ చిత్రం వస్తాద్ ఫేమ్ గోపిసుందర్ సంగీతాన్ని బెంగుళూరు డేస్ చిత్రం ఫేమ్ పి ఎస్ వినోద్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement