Allu Arjun Multistarrer Movie With Shahid Kapoor In Bollywood - Sakshi
Sakshi News home page

Allu Arjun Multistarrer In Bollywood: బాలీవుడ్‌లోకి బన్నీ.. మల్టీస్టారర్‌కు గ్రీన్‌ సిగ్నల్‌!

Published Sat, Nov 27 2021 4:05 PM | Last Updated on Sat, Nov 27 2021 4:30 PM

Allu Arjun Multistarrer Movie With Shahid Kapoor In Bollywood - Sakshi

టాలీవుడ్‌లో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఇంతవరకు మల్టీస్టారర్ మూవీ చేయలేదు. కాని బాలీవుడ్ లో మార్కెట్ కోసం సీరియస్ గా ట్రై చేస్తుండటంతో అక్కడ ఒక మల్టీస్టారర్ చేయాలనుకుంటున్నాడట. ప్రస్తుతం ఈ రూమర్ బీటౌన్ ను షేక్‌ చేస్తోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అర్జున్ తో హిందీ మూవీ ప్లాన్ చేస్తున్నారట. ఈ మూవీలో బన్నితో పాటు బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ నటించబోతున్నట్లు తెలుస్తోంది.

షాహిద్ కపూర్ తో జెర్సీ హిందీ  రీమేక్ నిర్మించాడు అల్లు అరవింద్. ఈ మూవీని డిసెంబర్ 31న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. షాహిద్ కపూర్, అల్లు అర్జున్ కాంబినేషన్ లోనే డెడ్లీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నారట. రాబోయే రెండు మూడు ఏళ్లలోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందట. ఒక వైపు కబీర్ సింగ్ , మరోవైపు పుష్ప రాజ్ స్క్రీన్ పై ఎలాంటి సినిమాలో కనిపించనున్నారు అనేది హాట్ టాపిక్ గా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement