ముగ్గురు హీరోలతో మహేశ్‌ డైరెక్టర్‌ సినిమా.. భారీ మల్టీ స్టారర్‌ ! | Director Parashuram Planning Big Multistarrer With 3 Heros | Sakshi
Sakshi News home page

Parashuram: ముగ్గురు హీరోలతో మహేశ్‌ డైరెక్టర్‌ సినిమా.. భారీ మల్టీ స్టారర్‌ !

Published Mon, Jan 10 2022 8:32 PM | Last Updated on Mon, Jan 10 2022 8:34 PM

Director Parashuram Planning Big Multistarrer With 3 Heros - Sakshi

Director Parashuram Planning Big Multistarrer With 3 Heros: దర్శకుడు పరశురామ్‌ ప్రస్తుతం సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబుతో సర్కారు వారి పాట సినిమాను తెరకెక్కిస్తున్నారు. కీర్తి సురేశ్ హీరోయిన్‌గా చేస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ చివరి దశలో ఉంది. ఏప్రిల్‌ 1న ఈ సినిమా భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్‌ ప్రకటించారు. ఇక ఈ సినిమా తర్వాత స్టార్‌ హీరోలతో భారీ మల్టీ స్టారర్‌ను ప్లాన్‌ చేశాడట పరశురామ్‌. ప్రస్తుతం ఈ టాపిక్‌ సోషల్ మీడియాలో గింగిరాలు తిరుగుతోంది. మళ్లీ ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా రేంజ్‌లో తెరకెక్కిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలు ఎంతవరకూ నిజమో వేచి చూడాలి మరి. ఇదిలా ఉంటే అక్కినేని నాగ చైతన్య హీరోగా 14 రీల్స్‌ సంస్థలో పరశురామ్‌ ఓ సినిమా చేయాల్సి ఉంది.

డ్యాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ శిష్యుడిగా 'యువత' సినిమాతో వెండితెరకు డైరెక్టర్‌గా పరిచయమయ్యాడు పరశురామ్‌. తర్వాత ఆంజనేయులు, సోలో, సారొచ్చారు, శ్రీరస్తు శుభమస్తు వంటి చిత్రాలతో ఆకట్టుకున్నాడు. చేసింది తక్కువ సినిమాలే అయినా గీత గోవిందం చిత్రంతో రూ. 100 కోట్ల మార్క్‌కు వెళ్లాడు. పరశురామ్‌ ఒక డైరెక్టర్‌గా ఎంత కష్టపడతాడో సర‍్కారి వారి పాట సినిమా చిత్రీకరణలో నిరూపించాడు. మండుటెండలో కూర్చుని తన స్క్రిప్ట్‌ వర్క్‌ చూసుకోవడం పలువురిని ఆకట్టుకుంది. 

ఇది చదవండి:  ‘సర్కారి వారి పాట’ సెట్‌లో ఎంపీ శశిథరూర్‌..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement