
‘‘తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గర్వంగా చెప్పుకునే ఫైట్‌మాస్టర్ విజయ్. మూడేళ్ల ముందు ఆయన కొడుకు రాహుల్ జిమ్నాస్టిక్స్ వీడియో చూసి స్టన్ అయిపోయా. అటువంటి రాహుల్ సినిమాకు నేను సమర్పకుడిగా వ్యవహరించడం ఆనందంగా, గర్వంగా ఉంది. భవిష్యత్తులో తను మంచి హీరోగా ఎదుగుతాడు’’ అని రచయిత, నిర్మాత కోన వెంకట్ అన్నారు. సీనియర్ ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘ఈ మాయ పేరేమిటో’. కావ్యా థాపర్ కథానాయిక.
రాము కొప్పుల దర్శకత్వంలో దివ్యా విజయ్ నిర్మించారు. ఫైట్ మాస్టర్ విజయ్ మాట్లాడుతూ– ‘‘మా సినిమా చూసిన సెన్సార్ సభ్యులు మంచి సినిమా చేశారని అభినందించడం ఆనందంగా ఉంది. ఈ నెల 24న సినిమాను విడుదల చేద్దామనుకున్నాం. కానీ, కొన్ని కారణాల వల్ల విడుదల చేయడం లేదు. త్వరలోనే రిలీజ్ తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు. ‘‘మా సినిమా ప్రివ్యూ చూస్తున్నప్పుడు కోనగారు ఏమంటారోనని చాలా టెన్షన్ పడ్డా. మూడు నాలుగు సినిమాలు చేసిన అనుభవం ఉన్న హీరోలా చేశావని అనగానే హ్యాపీగా అనిపించింది’’ అన్నారు రాహుల్ విజయ్. నిర్మాత దివ్యా విజయ్, హీరోయిన్ కావ్యా థాపర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment