
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో సమావేశమైన టాలీవుడ్ నిర్మాతలు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన అగ్ర నిర్మాతలు భేటీ అయ్యారు. బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్మాతలు దగ్గుబాటి సురేష్, శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, నల్లమలుపు బుజ్జి, జెమిని కిరణ్ తదితరులు ముఖ్యమంత్రిని కలిశారు. సమావేశానంతరం దగ్గుబాటి సురేష్ మాట్లాడుతూ.. ఆరేళ్ల క్రితం విశాఖపట్నంలో హుద్‌హుద్ తుపాను సృష్టించిన విలయానికి నిరాశ్రయులైన వారిని ఆదుకోవడంలో భాగంగా సినీ పరిశ్రమ నిధులు సేకరించి వాటితో విశాఖలో బాధితులకు ఇళ్లు కట్టించినట్లు తెలిపారు. దాదాపు రూ.15 కోట్ల నిధులు వచ్చాయని, ఈ మొత్తంతో గృహ సముదాయాన్ని నిర్మించామన్నారు. ఆ ఇళ్లను ప్రారంభించాలని సీఎం వైఎస్ జగన్‌ను కోరామని, ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సినీ నిర్మాత, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment