
కేసీఆర్‌కు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లేఖ
హైదరాబాద్: డ్రగ్స్ సమస్యను సున్నితంగా పరిష్కరించాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ను తెలుగు సినిమా పరిశ్రమ కోరింది. డ్రగ్స్ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు బుధవారం లేఖ రాసింది. డ్రగ్స్ కేసు ప్రభావం వేలాది కుటుంబాలపై పడనుందని, సినిమా పరిశ్రమ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని హుందాగా దర్యాప్తు సాగించాలని కోరుకుంటున్నామని తెలిపింది. దీనికి తమ వంతు సహకారం అందిస్తామని హామీయిచ్చింది.
సమాజం, మీడియా నుంచి తాము సానుభూతి కోరుకుంటున్నామని వెల్లడించింది. డ్రగ్స్ కేసు విచారణ జరిగిన 10 రోజులు ఇండస్ట్రీకి చీకటిరోజులుగా వర్ణించింది. డగ్స్ వాడిన వారిపై తామే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపింది. డ్రగ్స్ వ్యవహారం తమందరికీ ఓ కుదుపు, ఓ హెచ్చరిక అని తెలుగు సినిమా పరిశ్రమ పేర్కొంది.