సీఎం జగన్‌తో సినీ పెద్దల భేటీ | Tollywood BigWigs Meets CM YS Jagan At Tadepalli | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌తో సినీ పెద్దల భేటీ

Published Tue, Jun 9 2020 3:26 PM | Last Updated on Tue, Jun 9 2020 4:08 PM

Tollywood BigWigs Meets CM YS Jagan At Tadepalli - Sakshi

సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో సినీ ప్రముఖుల సమావేశం ప్రారంభం అయింది. తెలుగు సినీ పరిశ్రమ అభివృద్దిపై చర్చించేందుకు మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు‌ ఆఫీస్‌లో‌ చిరంజీవి నేతృత్వంలోని టాలీవుడ్‌ బృందం ముఖ్యమంత్రిని కలిశారు. ఏపీలో షూటింగ్‌లకు సింగిల్‌ విండో అనుమతి ఇవ్వడంపై సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలపనున్నారు. అదేవిధంగా ప్రస్తుతం టాలీవుడ్‌లోని సమస్యలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశానికి మెగాస్టార్‌ చిరంజీవితో పాటు నాగార్జున, సురేష్‌ బాబు, త్రివిక్రమ్‌, రాజమౌళి, సి.కళ్యాణ్‌, దిల్‌ రాజు తదితరులు హాజరయ్యారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement