
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో రేపు (మంగళవారం) తెలుగు సినీ ప్రముఖులు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, జెమిని కిరణ్, రాజమౌళి, జీవిత, త్రివిక్రమ్, కొరటాల శివ, సి.కళ్యాణ్, దామోదర ప్రసాద్, ప్రసన్న కుమార్‌లతో పాటు మొత్తం 25 మంది సభ్యుల బృందం పాల్గొననుంది. ఈ సందర్భంగా కరోనా లాక్‌డౌన్ కారణంగా నిలిచిపోయిన సినిమా షూటింగ్‌లకు అనుమతితో పాటు థియేటర్ల ఓపెన్, తదితర అంశాల గురించి కూడా సీఎం జగన్‌తో చర్చించే అవకాశం ఉంది. ( తెలంగాణలో షూటింగ్‌లకు అనుమతులు)
కాగా, తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో సినిమా, టీవీ షూటింగులకు అనుమతించిన సంగతి తెలిసిందే. కోవిడ్-19 మార్గదర్శకాలు, లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ రాష్ట్రంలో సినిమా, టీవీ కార్యక్రమాల షూటింగులు కొనసాగించుకోవచ్చని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. దీనికి సంబంధించిన ఫైలుపై సీఎం కేసీఆర్ సోమవారం సంతకం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment