నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం కన్నుమూత | dharmavarapu subramanyam passes away | Sakshi
Sakshi News home page

నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం కన్నుమూత

Published Sat, Dec 7 2013 10:52 PM | Last Updated on Sat, Sep 2 2017 1:22 AM

నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం కన్నుమూత

నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం కన్నుమూత

హైదరాబాద్:ప్రముఖ హాస్య నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం(53) శనివారం రాత్రి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన దిల్షుక్నగర్లోని తన స్వగృహంలోని తుది శ్వాసవిడిచారు. ఆనందో బ్రహ్మ హాస్య సీరియల్ తో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుబ్రహ్మణ్యం అకస్మిక మృతి సినీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. బావా బావా పన్నీరు సినిమాతో సినీ ప్రస్థానం మొదలు పెట్టిన ఆయన నరేష్ హీరోగా తోకలేని పిట్ట సినిమాకు దర్శకత్వం వహించారు. ఇప్పటి వరకూ ఆయన దాదాపు 870  చిత్రాల్లో పలుపాత్రల్లో నటించి అభిమానులను అలరించారు. ఆయన అకస్మిక మృతి తెలుగు సినీ లోకాన్ని విషాదంలోకి నెట్టింది.

 

ప్రకాశం జిల్లాలోని కొమ్మునేని వారి పాలెంలో పుట్టిన ఆయన తెలుగు చిత్రసీమలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతికి మండలి ఛైర్మన్ గా  సేవలందించారు. గత 350 ఎపిసోడ్ ల నుంచి సాక్షి టీవీలో ప్రసారమయ్యే డింగ్ డాంగ్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా పని చేస్తున్నారు. ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న రుద్రమదేవి సినిమాలో నటిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement