తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోలను వదిలేస్తే.. వాళ్ళ తర్వాత మిడ్ రేంజ్ హీరోలున్నారు. అంటే వాళ్లతో మీడియం బడ్జెట్ సినిమాలు హాయిగా చేసుకోవచ్చు అన్నమాట. వారిలో రవితేజ, నాగ చైతన్య, విజయ్ దేవరకొండ, నాని, రామ్ లాంటి హీరోలుంటారు. వాళ్ల సినిమాలు హిట్టైతే 50 కోట్ల షేర్ వచ్చే అవకాశం ఉంటుంది.అయితే వీళ్ల సినిమాలు ఎప్పుడూ మినిమమ్ 30 నుంచి 40 కోట్ల షేర్ మధ్య వసూలు చేస్తుంటాయి.
నాగ చైతన్యకు కూడా 30 కోట్ల మార్కెట్ ఉంది. హిట్ అయితే కచ్చితంగా 30 కోట్లు వసూలు చేయడం ఖాయం. అయితే ప్రస్తుతం చైతన్య సరికొత్త రికార్డు సృష్టించాడు. మీడియం రేంజ్ హీరోలలో వరసగా నాలుగు 50 కోట్ల గ్రాస్ అందుకున్న సినిమాలున్న హీరోగా నిలిచాడు. మీడియం రేంజ్ హీరోలలో ఈ రికార్డు ఎవరికీ సాధ్యం కాలేదనే చెప్పాలి.
చైతన్య నటించిన గత నాలుగు చిత్రాలు మంచి విజయాలు సాధించడం తెలిసిందే. అందులో రెండు మల్టీస్టారర్స్ (వెంకీ మామ, బంగార్రాజు) కాగా రెండు సోలో విజయాలు. వాటిలో సమంతతో కలిసి నటించిన మజిలీ సినిమా 40 కోట్ల షేర్ వసూలు చేసింది. ఆ సినిమా 70 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసి నాగ చైతన్య కెరీర్‌లో బిగ్గెస్ట్ సోలో హిట్‌గా నిలిచింది. అలాగే వెంకటేష్‌తో కలిసి నటించిన వెంకీ మామ కూడా 58 కోట్ల చేసింది.
ఇక శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరితో 60 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఔరా అనిపించాడు. సంక్రాంతికి రిలీజైన బంగార్రాజులో తన తండ్రి నాగార్జునతో పాటు నటించి చిన బంగార్రాజుగా అదరగొట్టాడు నాగ చైతన్య. ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే 50 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇలా మీడియం రేంజ్ హీరోలలో వరసగా నాలుగు సార్లు 50 కోట్లు గ్రాస్ అందుకున్న సినిమాలు ఒక్క నాగ చైతన్య కెరీర్‌లో మాత్రమే ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment