అక్కినేని నాగార్జున, నాగచైతన్య హీరోలుగా నటించిన తాజా చిత్రం బంగార్రాజు. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదలైన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. తొలి రోజు రికార్డు వసూళ్లు సాధించిన బంగార్రాజు.. రెండో రోజు కూడా అదే దూకుడు చూపించింది. కోవిడ్ నిబంధనలు అదిగమించి.. రెండు రోజుల్లో రూ.36 కోట్లు వసూళ్లు చేసి మరోసారి బాక్సాఫీస్‌పై అక్కినేని ఫ్యామిలీ సత్తా చూపించారు.
రూ.40 కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగార్రాజు.. రెండో రోజు నైజాంలో రూ.4.47 కోట్లు, సీడెడ్ రూ. 3.46 కోట్లు, ఉత్తరాంద్రలో రూ.2.20 కోట్లు, ఈస్ట్: 1.75 కోట్లు, గుంటూరు: 1.78 కోట్లు, కృష్ణా: 0.96 కోట్లు, నెల్లూరు: 0.85 కోట్లు రాబట్టింది. మొత్తంగా రెండు రోజుల్లో రూ. 36 కోట్లు వసూళ్లు చేసినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. దీనికి సంబంధించిన స్పెషల్ పోస్టర్‌ని కూడా విడుదల చేసింది.
సంక్రాంతికి విడుదలైన ఏకైక పెద్ద సినిమా, అలాగే గ్రామీణ నేపథ్యానికి సంబంధించిన స్టోరీ కావడం ‘బంగర్రాజు’కు బాగా కలిసొచ్చింది. ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించగా నాగార్జున నిర్మాతగా వ్యవహరించారు. నాగార్జున సరసన రమ్యకృష్ణ, నాగచైతన్య సరసన కృతిశెట్టి నటించారు.
(చదవండి: బంగార్రాజు మూవీ రివ్యూ)
Comments
Please login to add a commentAdd a comment