గత సంక్రాంతి బరిలో ‘సోగ్గాడే చిన్నినాయనా' సినిమాను దింపేసి అత్యధిక వసూళ్లను రాబట్టాడు కింగ్ నాగార్జున. ఈ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిన ‘బంగార్రాజు’ చిత్రం కూడా ఈ సంక్రాంతి సందర్భంగా విడుదలైంది. అనుకున్నట్టుగానే నిన్న(జనవరి 14) ఈ సినిమాను థియేటర్తోకి తీసుకు వచ్చింది చిత్ర బృందం. గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో పాటు సంక్రాంతి పండగ వాతావరణాన్ని ప్రతిబింబించే సినిమా కావడం వలన 'బంగార్రాజు'కి అన్ని ప్రాంతాల్లో మంచి రెస్పాన్స్ వస్తోంది.
చదవండి: బాలయ్య మూవీ ఆఫర్ వదులకున్న నటి రాశి, ఆ సీన్‌పై అభ్యంతరంతోనేనట..
ఈ క్రమంలో తొలి రోజే బంగార్రాజు అన్ని ప్రాంతాలతో పాటు నైజాం, సీడెడ్‌లో మంచి కలెక్షన్స్ రాబ్టటినట్టు ట్రెడ్ వర్గాల చెబుతున్నాయి. నైజామ్‌లో తొలి రోజున 3.1 కోట్ల గ్రాస్‌ను.. 1.73 కోట్ల షేర్‌ను రాబట్టినట్టుగా చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న కరోనా కాలం, 60 శాతం సీట్ల ఆక్యూపెన్సీ పరిస్థితుల్లో ఇవి బంగార్రాజుకు మంచి ఓపెనింగ్స్ అనే అంటున్నారు సినీ వెశ్లేషకులు. అలాగే ప్రపంచవ్యాప్తంగా 1200 స్క్రీన్లలో విడుదలైన ఈ మూవీ తొలి షో నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంంది.
చదవండి: ఆర్‌ఆర్‌ఆర్' ఫ్యాన్స్‌కు స్పెషల్ సర్‌ప్రైజ్.. సంక్రాంతి కానుకగా
తొలి రోజున ఓవర్సీస్‌లో ఈ సినిమాకి మోస్తారు వసూళ్లు కనిపించాయి. ప్రీమియర్ల ద్వారా 40 వేల డాలర్లు వసూలు చేయగా, తెలుగు రాష్ట్రాల్లో 8 కోట్ల రూపాయలు కొల్లగోట్టినట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మున్ముందు కూడా కలెక్షన్లు ఇంకా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు సినీ విశ్లేషకులు. అయితే రిలీజ్‌కు ముందే బంగార్రాజు చిత్రం 39 కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. కాగా బంగార్రాజులో నాగార్జున, నాగ చైతన్యలు కాగా వారికి జోడిగా రమ్యకృష్ణ, కృతిశెట్టిలు నటించారు.
Comments
Please login to add a commentAdd a comment