
అధర్వ, మేఘా ఆకాశ్
‘గద్దలకొండ గణేష్’ చిత్రంతో తెలుగు చిత్రపరిశ్రమకి పరిచయమయ్యారు తమిళ యువ నటుడు అధర్వ మురళి. ఆయన నటించిన తమిళ చిత్రం ‘బూమరాంగ్’ను అదే టైటిల్‌తో తెలుగులో విడుదల చేస్తున్నారు నిర్మాత సీహెచ్ సతీష్ కుమార్. ఆర్. కణ్ణన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మేఘా ఆకాశ్, ఇందుజా రవిచంద్రన్ కథానాయికలు.
రేపు(3న) విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్‌ను దర్శకుడు హరీష్ శంకర్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘అధర్వ నాకు ఇష్టమైన హీరో. చాలా ప్యాషనేట్ హీరో.. యువత తలుచుకుంటే ఎలాంటి మార్పు తీసుకురావచ్చనే సందేశాన్ని ఈ చిత్రంలో చక్కగా చెప్పారు’’ అన్నారు. ‘‘ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు మా సినిమాలో ఉంటాయి. తర్వాత ఏం జరుగుతుందోనని ఊహించలేని విధంగా దర్శకుడు స్క్రీన్‌ప్లే రాశారు’’ అన్నారు నిర్మాత సీహెచ్ సతీష్ కుమార్.
Comments
Please login to add a commentAdd a comment