
సాక్షి, హైదరాబాద్ : ప్రత్యేక హోదా ఉద్యమానికి తెలుగు సినీ పరిశ్రమ మొత్తం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మద్దతు తెలిపినట్లు వచ్చిన వార్తలపై టాలీవుడ్ పెద్దలు వివరణ ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్, సినీనటుడు విజయచందర్ డిమాండ్ చేశారు. ఇటీవల సినీరంగ ప్రముఖులు సి.అశ్వనీదత్, కె.రాఘవేంద్రరావు, కేఎల్ నారాయణ, జెమినీ కిరణ్, వెంకటేశ్వరరావు తదితరులు అమరావతిలో చంద్రబాబును కలసి ప్రత్యేక హోదా విషయంలో సినీ పరిశ్రమ సంపూర్ణ మద్దతు ఉంటుందని సీఎంకు తెలిపినట్లుగా వార్తలొచ్చాయన్నారు.
ఈ నేపథ్యంలో విజయచందర్ సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. నిర్మాతల సమావేశంలో తాను ఇదే విషయాన్ని కేఎల్ నారాయణ దృష్టికి తెచ్చి అందరి తరఫున ఎలా హామీ ఇస్తారని ప్రశ్నించానన్నారు. తాను వ్యక్తిగతంగా బాబుకు మద్దతు తెలిపానే తప్ప మొత్తం పరిశ్రమ తరఫున కాదన్నారన్నారు. మిగతా నలుగురు తమ వివరణలు ఇచ్చి తీరాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment